Friday, February 27, 2009

అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి ? (పెళ్లి చేసుకోనివాని కదా)

శ్రీ మహాభారతములో జరత్కారువు అనే పేరుగల ఒక మహారుషి కలదు. అతడు ఏది ఏమైనా సరే తను పెళ్లి చేసుకోనని భీష్మించుకొని ఉండిపోయాడు. ప్రతీదినము లానే ఆ రోజు కుడా తప్పస్సు చేసుకోటానికి పోతుంటే. ఒక పాడు బడ్డ బావిలో సన్నని మూలుగులు వినబడ్డాయి వాటిని విన్న జరత్కారువు ఆ భావిలో తొంగి చూచాడు . ఆ బావి చాలా లోతుగా ఉంది అందులో ఎందరో మహారుషులు , ఆ నూతిలో పెరిగిన చెట్టు ఉదాలని పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతున్నారు.
జరత్కారువుకి ఆనందం వేసింది. ఇలా తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేయటం, కఠోర తపస్సు అవుతుందేమోనని ఆనందించి, వాళ్ళతో ఇలా అన్నాడు, స్వామీ! ఇది ఏ తపస్సు? అని .
వాళ్లు బాధ పడుతూ "నాయనా! ఇది తపస్సు కానే కాదు. మా వంశంలో జరత్కారు వనే ఒక దుర్మార్గుడు , వివాహం చేసుకోనని భీష్మించుకొని ఉండిపోయాడు. వాడు వివాహం చేసుకు సంతానాన్ని కన్నా పక్షములో తప్ప మాకు మోక్షము ఉండదు. మోక్షము రాదు కాబట్టి- ఇదిగో- అధమ లోకాలకి పోతున్నాము. నీకు ఎక్కడైనా ఆ వ్రాత్యుడు (ముర్కపు పట్టుదల కలవాడు) కనిపిస్తే చెప్పి మమ్మల్ని ఒడ్దేక్కిమ్చి ఊర్ద్వాలోకాలకి పోయే పద్దతిని కలిపించు" అన్నారు.
ఆశ్చర్యపడ్డ జరత్కారువు వాళ్ళతో -" అయ్యా" నేనే ఆ శఠుణ్ణి . క్షమించండి . మిమ్ములను ఊ ర్ద్వాలోకాలకి పంపే ఏర్పాటు నేనే చేస్తాను. నా తపస్సు నాకు చాలు అనుకున్నాను గాని- ఇది నాకు తెలియనిది- అంటు వెళ్ళిపోయి, తనకు వివాహము కావని ఉందని అందరితో చెప్పాడు.

పట్టుదలున్నవాడికి, ఆ పట్టుదల అనేది, ఏదో సమయంలో కొంత తగ్గినా, మళ్ళీ రాక మానదు. అలాగే, వివాహం చేసుకునే స్థాయికి జరత్కారువు దిగినా తన పేరే కల కన్యనే, వివాహం చేసుకుంటానన్నాడు. ఈ రోజుల్లో అయితే మరుక్షణంలో అలాంటి పేరు కలవారు వుండెవారు. కానీ ఆ కాలంలో అలాకాదు. వెతికారు వెతికారు ఎంతకీ అలాంటి పేరు కల అమ్మయే దొరకలేదు చివరికి వాసుకి అనె పాము చెల్లెలి పేరు అదే అయ్యింది. మొత్థనికి వివాహం అయ్యింది. వాళ్ళకి ఆస్తికుడు అనే మహాఋషి కలిగాడు. జనమేజేయుని తండ్రి పరీక్షిత్తు. సర్పం కరచి చనిపోతే , లోకంలో సర్పాలే ఉండరాదని వాటిని చంపేందుకు సర్పయాగం ను జనమేజేయమహారాజు ప్రారంభిస్తే ఆపి , సర్పాల ని రక్షించింది. ఈ మహఋషే అందుకనే, పాము కంపిస్తే `ఆస్తిక! ఆస్తిక! అని అనవలసిందని, పెద్దలనేవారు. పాములకి రక్షచేసినవాడు కదా! అని . ఆ కధ అలా సాగి వెళ్ళిపోయినది.

ఈ ఆస్తికుణ్ణి కన్న కారణంగా ఆ బావిలో ఉన్న వారందరికి ఊర్ద్వ గతులు కలిగాయి. పితృ ఋణం తీరిందన్నమాట. మరి సన్యాసుల మాట ఎలా?
అంటె, ఆ తండ్రికున్న పుతృలలో ఏ ఒక్క పుత్రుడు వివాహం చేసుకున్నా చాలును. అంతా సన్యసించరు కదా.
భారతంలో బీష్ముడు ఇలా ప్రతిజ్ఞ చేసాడు కదా! మరి పితృఋణం ఎలా తీరింది? అంటే.
`భ్రాతౄణా మేకజాతానాం ఏకశ్చేత్ పుత్రబాంధవే -
సర్వేతే నైవ పుత్రేణ , పుత్రిణో మను రబ్రవీత్ '
అని ప్రమాణ వచనం.
తన తండ్రికి ఉన్న పుత్రులలో , అంటే, తన సోదరుల్లో ఏ ఒక్కరికి సంతానం ఉన్నా, పితృ, పితామహులకి ఊర్ద్వలోకాలు కలుగుతాయని శాస్త్రము చెప్పింది.
భీష్ముని సోదరునికి సంతానం ఉందికదా. సోదరుని తాత ఎవరో, తనకి తాత అతడే కదా! అందుకని పితామహులు పతితులు కారని, ధర్మశాస్త్రము లో మనువు చెప్పడు.

2 comments:

ఓ బ్రమ్మీ said...

ఏదో ఒక వెసలు బాటు ఎవ్వరికి వారు కల్పించేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఓ మంచి విషయాన్ని తెలియజేసారు

vtvacharya said...

pelli chesukoni variki eekadha oka margadarsekam