ఏ దంపతులలోనైనా ఐదు విదాలల్లో ఒకరే: రెండవది గౌరీ శంకరుల జంట:
వీళ్ళది అర్ధనారీశ్వర రూపం . తలనించి కాలి వ్రేలి వరకు నిట్టనిలువుగా చెరిసగముగా ఉంటూ రెండు కలపిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత.
ఆలోచనకి తలా, కార్యనిర్వాహనానికి కాలు సంకేతము. (తల లేదా? అని తిడుతువుంటారు. అలాగే వాడికి తలతిక్క అని కుడా అంటుంటారు. ఇక్కడి తల అనే మాటకీ ఆలోచన అనే కాదా అర్ధం! అలాగే మాటలు కోటలు దాటుతాయి గానీ, కాలు గడపదాతాడు - అంటుంటారు. అంటే ఇక్కడి కాలు అనే మాటకీ "క్రియ" అని కదా అర్ధం . కాబట్టి కాలు అంటే కార్యనిర్వాహనమే ) అలా ఏ భార్యాభర్తలు ఆలోచన దగ్గర్నించి క్రియ వరకు సరిసమానంగా నిర్వహించుకుంటు పోతుంటారో, ఆ జంట గౌరీ శంకరుల జంట అవుతుందన్నమాట.
మరో విశేషం కుడా ఉంది. ఓ సగం రూపంగా అయ్యవారు కుడివైపున మరో సగం రూపంగా అమ్మవారు ఎడంవైపునా ఉంది, ఆ ఇద్దరి కలయికతో ఏర్పడినదే అర్ధనారీశ్వర రూపం అవుతోంది. ఇక్కడే ఉంది విశేషం.
అయ్యవారి నెత్తిమీద కురులు ముడివేసి అందముగా తీర్చిన కొప్పుమ్టే ఎడమ ప్రక్కగా అమ్మవారి `జడ బిళ్ళ' (చూడామణి) ఉంటుంది.
అయ్యవారి నుదుటి మీద ముడో కన్నుంటే, ఆ ఎడమప్రక్క, కస్తూరితో కలసిన గంధపుబొట్టు అమ్మవారి కుంటుంది.
అయ్యవారి చెవికి నాగకడియం ఉంటే, అమ్మవారి చెవికి బంగారపు కమ్మ వుంటుంది.
అయ్యవారి కంటమునకు విషపు గుర్తు నీలంగా ఉంటే, అమ్మవారి కంఠానికి చక్కని గంధపు బొట్టు వుంటుంది.
అయ్యవారి మెడలో రుద్రాక్షలుమ్టే అమ్మవారి మెడలో రత్నాల ఆభరణాలు ఉంటాయి.
అయ్యవారి బుజాలకి డందకడియాలు గా పాములే ఉంటాయి , అమ్మవారికి రత్నగదమ్ ఉంటుంది.
అయ్యవారి చేతిలో భిక్షాపాత్ర వుంటే, అమ్మవారి చేతిలో భిక్షార్డులకి అన్నం పెట్టేందుకు గరిటె సిద్ధముగా వుంటుంది.
అయ్యవారు పుటలు కడితే, అమ్మవారు బంగారుపట్టు చీరె ధరించి ఉంటుంది.
ఎందుకు ఇంత చెప్పవలసి వచ్చిందంటే. అయ్యవారు పూర్తీ బిచ్చగాని వేషంలో ఉంది కుడా, అమ్మవారు ధనవంతుల పుత్రికగానే ఉమ్చుతాడని గుర్తింప చేయడానికే , ఆయనికి ఏం కావలసిన అమ్మవారే ఇవ్వాలి.
ఇలా, భార్యని గొప్పగా చూస్తూ, ఏది కావాలన్నా ఆమెనే అడిగే భర్త శంకరుడు. తన భర్త అడిగిందే తడవుగా ఇచేది - భర్త అమాయకుడై విషాన్ని మింగబోతుంటే వెళ్లి రక్షించు కునేదీ, ( భర్తని రక్షించుకునే గడుసు తనము కలది)
ఆయన భార్య గౌరీదేవి.
కాబట్టి భార్యని గొప్పగా చూసుకునే భర్తా, బోలా బోలీగా ఉన్నా భర్త ఆపదలో చిక్కుకుంటే రక్షించే భార్యా- ఉన్నా జంట గౌరీ శంకరుల జంట అన్నమాట .
ఒకరి కోసం ఒకరు బ్రతికే జంటలన్నీ గౌరీ శంకరుల జంటే. అలాంటి వారిని ఆ గౌరీ శంకరులు తప్పక ఆసీర్వధించుదురు గాక.
2 comments:
:) బాగా చెప్పారు!!
బాగా చెప్పారు.
Post a Comment