ఏ దంపతులైనా ఐదు విధాలల్లో ఒకరే : మూడవది బ్రహ్మా సరస్వతుల జంట.
మనము మొదటి శ్లోకములో భారతీ విధి అని చెప్పుకున్నాము కదా ........
అయితే ఇక్కడ బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది అంటారు. నాలుక అనేది మాటకు సంకేతము .
బ్రహ్మ నాలుకమీద సరస్వతి ఉంటుంది అంటే అర్ధము ఏమిటీ?
దాని అర్ధము ఇద్దరి మాట ఒక్కటే అని . ఇద్దరి లో ఎవరు మాటాడినా అది ఒకటే అయ్యి ఉంటుంది. అల్లా ఏ మాట మాటాడినా , ఆ భార్య మాటే భర్త మాటాడుతాడు. ఆ భర్త మాటే భార్య మాటాడుతుంది.
అల్లాంటి జంట ఎక్కడ వుంటుందో ఆ జంటను బ్రహ్మాసరస్వతుల జంట అనవచ్చును.
వీరి లా ఒకరి కి ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నవారు . ఒకరి మీద ఒకరికి అభిమానము ప్రేమ ఉన్నప్పుడు వారి వారి మనస్సులు తెలిసి ఒక్కగా మాతాడుతారు. అల్లాంటి జంటను బ్రహ్మా సరస్వతులు కాపాడుదురు గాక.
No comments:
Post a Comment