స్త్రియః శ్రీయ శ్చ గేహేన విశేషో உస్తికశ్చన -
స్త్రీలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులు అంటారు. తానెలా వున్నా ,తన భార్య మాత్రం ఎక్కువ ఆభరణాలతో అలంకరిచబడి, తనకంటే మిన్నగా వుండాలని ఏ ఇంట అయినా చూస్తే ప్రతీ వ్యక్తీ కోరుకుంటాడు. అలా స్త్రీలకి విలువనిచ్చేతనం పురానేతిహాసకాలం నుండి వచ్చిందే. ఎంతటి యజ్ఞాన్ని అయినా భర్త తానూ నిర్వహించ దలచినచో మొట్టమొదట భార్య అనుమతిని పొందవలసినదే అని ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయిట. అంటే ఇక్కడా స్త్రీ స్థానం తక్కువైనట్టు ఎక్కడైనా అనిపిస్తోందా?
అలాగే ఏ ఇంత అయినా శ్రాద్ధాన్ని నిర్వహించాలంటే ముందుగా దీపారాధనని చేయవలసినది యజమాని భార్య మాత్రమె. ఆమె అలా చేయనినాడు మొదటి మంత్రం మొదటి అక్షరం కుడా వినిపించాడు.
అలాగే ఏ సంకల్పము చేయదలచిన పురుషుడు వివాహితుడైన పక్షములో "ధర్మపత్నీ సమేతస్య" అనకపోతే ఆ సంకల్పము నిష్ప్రయోజకం.
స్త్రీ పాముఖ్యం ఇంతగా ఉంది కాబట్టే, ముందు మనం అనుకున్నట్టు గా , స్త్రీ ఇంటికి పోయి పెండ్లి చేసుకుని పురుషుడు ఆమెని తెచ్చుకుంటూ ఉండేవాడు. లోకంలో ఎక్కడైనా స్థాయిలో పెద్దైన వారింటికి చిన్నవాడు వెళ్ళటం కనిపిస్తుంది.
పురుషుడు ఆమె ఇంటికి పోవదానిక్కార్ణం, ఆమెని సగౌరవంగా ఇంటికి తెచ్చుకుని హారతి ఇచ్చి తన ఇంటిలోనికి తెచ్చుకోవడం........ ఇదంతా ఆమెకున్న స్థాయికి గౌరవానికి ప్రత్యేక నిదర్సనంగాలోకానికి తెలియజేయటమే.
1 comment:
ade manasamskrutilo stree kunna gouravam
Post a Comment