Thursday, September 1, 2011

ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము

 ఈడగుపెండ్లి

:  ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము  చేడెలాల ఇది చెప్పరుగా ||
:  పచ్చికబయళ్ళ పడతి ఆడగ | ముచ్చట కౄష్ణుడు మోహించి |
      వెచ్చపు పూదండ వేసి వచ్చెనట | గచ్చుల నాతని కానరుగ ||
:  ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము  చేడెలాల ఇది చెప్పరుగా ||
:  ముత్తెపు ముంగిట ముదిత నడువగ | ఉత్తముడే చెలి వురమునను |
      చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక | జొత్తుమాని ఇటు జూపరుగా ||
:  ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము  చేడెలాల ఇది చెప్పరుగా ||
:  కొత్తచవికెలో కొమ్మనిలిచితే | పొత్తున తలబాలు వోసెనట |
     ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు | హత్తి సతిగూడె నని పాడరుగా ||