Thursday, February 26, 2009

అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి ?


`జాయమానో వై బ్రాహ్మణ స్త్రిభి ఋణ వా జాయతే
బ్రహ్మచర్యే షిభ్యో 11 యజ్ఞేన దేవేభ్యః 11 ప్రజయా
పితృభ్య షవా 2 నృణో యః పుత్రే యజ్వా'
అని వేదం చెప్తోంది .ప్రతీ మనిషి పుడుతూనే, `మూడు' ఋణాలతో పుడతాడట. అవి ఋషిఋణం , దేవ ఋణం, పితృ ఋణం అనేవి. చేసిన అప్పు తీర్చాలి కదా మరి .
ఈ మూడు ఋణాలు తీర్తేనే అతడు ధర్మ పరుడన్నమాట. వీటిలో పితృ ఋణం తీరాలంటే, పెళ్లి చేసుకోవాలి. తీర్చుకునే విధాలు ఏమిటి ?
మొదటిది ఋషి ఋణం . నిస్వార్ధముగా ఋషులు రామాయణ-భారత-భాగవతాలు రాసారు. వాటిని అధ్యయనం చేస్తే ఋషి ఋణం తీరుతుంది. చదివి అర్ధం చేసుకోగల పాండిత్యం లేనివాళ్ళు, పదిమంది చదువుకునేలా ఉపన్యాసాలు చెప్పించడం- గ్రంధ ప్రచురణం- హరికధలు మొదలైన వాటి ద్వారా ప్రచారం చేసినా ఋషి ఋణం తీరుతుంది.
రెండవది దేవ ఋణం, వాళ్ళని ఆరాధిస్తూ యాగం చేస్తే, యాగం చేసే శక్తి లేకపోతె చేసేవారికి సహకరించినా ఆ ఋణం తీరుతుంది.
మూడవది పితృ ఋణం. వివాహం చేసుకుని సంతానాన్ని కానీ, గాలికి అలా వదిలి వేయకుండా ప్రయోజకుల్ని చేసి, -`ఫలాని వారి పిల్లలు'- అనే విధముగా చేసుకుంటే పితృ ఋణం తీరుతుంది. అందువల్లే వివాహ వ్యవస్థ ఏర్పడింది .

No comments: