Tuesday, February 10, 2009

నాల్గవది చాయాసూర్యుల జంట :

దంపతులైనా ఐదుగురిలో ఒక్కరే : నాల్గవ జంట చాయాసూర్యుల జంట.

Sun-01-june.gif (5980 bytes) సూర్యుడు చండ ప్రచండంగా వేలుగుతాడు . అతని భార్యైన చాయాదేవి అతని తీక్షణకు తట్టుకొంటు వెడుతూ వుంటుంది . తన భర్త లోకానికి ఉపకారము కోసం పాటు పడేవాడు. కానీ విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా నీడలా పరిస్థితికి అనుగుణముగా సర్దుకు పోతూ వుంటుంది చాయాదేవి .ఏ ఇంట భర్త కఠినముగా తీక్ష్ణము గా విసుగూ, చిరాకూ , కోపం, పట్టుదల లతో చండ ప్రచండగా ఉంటాడో, ఏ ఇంట అతని భార్య మాత్రము నెమ్మదిగాను , సాంతముగాను , అనుకువగాను ఉంది సంసారాన్ని తీర్చిదిద్దుకొంటు సర్దుకు పోయే గుణం కలిగి వుంటుందో . అలాంటి జంట , చాయా సూర్యుల జంట అవుతుంది.

ప్రతీ మనిషిలోని లోపాలు సహజం .అలాగే మంచితనము సహజము. ఎలా ఐతే చాయాదేవి సూర్యునిలో లోపం చండ ప్రచండమైన తీక్షణత ను గుర్తించింది కాని సూర్యునిలో గొప్పతనము పరోపకార గుణమును గుర్తించింది . ఆమె సూర్యునిలో మంచిని చూసి అతనితో సర్దుకు పోయింది . దంపతులు కూడా అంతే ఒకరు ఒకరు కోపం చికాకుగా వున్నప్పుడు రెండవవారు ప్రశాంతముగా ఉంది సమస్యను పరిష్కరించుకోవాలి. రెందవారు కూడా అదే పరిస్తితి వుంటే ఆ దాంపత్యము సవ్యముగా సాగదు.

ఒకరికి ఒకరు సహకరించుకొంటు సంసారాన్ని సరిగా వుంచుకుంటారో వారు చాయా సూర్యుల జంట అన్నమాట.


No comments: