ముందుగా ఏ శ్లోకాన్ని అయినా నిదానంగా చదవాలి . పితా " రక్షతి " కౌమారే , భర్తా " రక్షతి " యౌవనే........ అని ఇలా శ్లోకంలో నిండుగా "రక్ష"అనే మాట మాత్రమే వాడబడింది. స్త్రీ అనే ఆమె ఎప్పుడూ 'రక్షణ' చేయగల ఉత్తమమైనది అని దాని భావము. అందుకే బాల్యంలో తండ్రీ - యోవనంలో భర్తా- వార్ధక్యంలో పుత్రుడు ఆమె రక్షణ బాధ్యతని వహించారు. అలా రక్షించటం వారి బాధ్యతా, కర్తవ్యం కూడా.
అతి ముఖ్యమైన , విలువైన బంగారం లాంటివి వస్తువులని ఇళ్ళల్లో జాగ్రత్తగా భద్రపరుస్తాం. ఇల్లు అంత కట్టుదిత్తమైనవి కావనిపిమ్చినప్పుడు మరో ముఖ్యమైన ప్రదేశంలో జాగ్రత్త చేసుకుంటాము. ఇలా సొత్తుని రక్షించుకోవడం అనే దాన్ని ఒక్కరు కారు అందరు చేస్తారు. ఇలా అతి ప్రధానంగా భావించి జాగ్రత్త చేసుకోవదాన్నే రక్ష అనే మాటతో తెలియచేసారు పెద్దలు. అలా రక్షించుకొదగిన ఉత్తమ మైంది స్త్రీ కాబట్టే ఆమెని మూడుకాలాల్లో రక్షించాలని. శ్లోకంలో చెప్పారు.
రక్షించటమనే మాట ముసుగులో స్త్రీ వంటింటి కుందేలుగా మార్చారన్నది నేటి కాలపువారి వాదన.
నిజంగా ఆ మాటకు వస్తే స్త్రీలే వంటింటి కుందేలే అయ్యుంటే పురాణేతిహాస కాలాల్లో " నలభీమ పాకం" అనేమాటను బట్టి ,-నలుడు, భీముడు - అనే పురుషులే వంటలకి ప్రసిద్ధిగా కనిపించారు కానీ స్త్రీలెవ్వరు కనిపించరు.
తర్వాతమిగాతావిషయాలు తెలుసుకుందాము.
No comments:
Post a Comment