Thursday, July 23, 2009

గణఫతి పూజ


ప్రారంభములో సాగేది గణాధిపతి పూజ, దీన్నే గణపతి పూజ అని అంటారు. వైష్ణవులు అయితే విష్వక్సేన పూజ అంటారు.
శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః

అనే విషయాన్ని గమనెస్తే, శివకేశవ భేధమే లేదు కావున, రెండూ ఒకటే అవుతాయి. రోజు సంద్యావందనంలో ఈ శ్లోకాన్ని చదివి కూడా, బేధం ఉందని భావిస్తే, చెప్పేది ఏమీలేదు.

1) దేవీం వాచ మజనయంత దేవాః- అయం ముహుర్తః సుముహూర్తో అస్తు

2) య శ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళాl
తయో స్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగలమ్ll

౩) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్l
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేll
అని ఈ తీరుగా మంగల శ్లోకాలు వెడలుతాయి ప్రారంభములో, వరుసగా అర్దం చూద్దాం.

Thursday, July 16, 2009

కళ్యాణం కమనీయం.

కళ్యాణం! అనే పదంలో ఎంతో మధురంగా వుంటుంది. ప్రతీ మనిషి జీవితంలోను ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడ్క జీవితానికంతటికీ మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్బ్జుత క్షణం ఒక అసాధరణమైన, అనుభూతి. ఈకళ్యాణ్ ఘఢియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. భాద్యత యుతమైన పౌరుడిగా కుటుంబంలోను, అటు సంఘములోను కూడా ఒక గుర్తింపును కలగ జేసేది కళ్యాణమే!! ఎన్నెన్నో సుఖాలు, కష్త్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటిని ఒకరికొకరు సమానంగా పంచుకిని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణంవెనుక ఉన్న పరమార్హ్దం. ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక ఉన్న అర్ధమూ ఇదే!!! వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్ళీకి ఏయే దేవతలొస్తారో, వారివెంట ఎవరొస్తారో తెలుసుకుందాం.!!!
సరేనా అయితె ఇప్పుడుకాదు తరువాత post లో నుండి .

Tuesday, July 14, 2009

భీజక్షేత్ర ప్ర్రాధాన్యం


భీజం అంటే విత్తనం. క్షేత్రము అంటే భూమి. పురుషుణ్ణి విత్తనంతోను. స్త్రీని క్షేత్ర,ము గాను పోల్చారు. ప్రాచీనులు .భూమి , భూమిగా ఎంతకాలమైన ఉండగలదు. కాని, విత్తనం ఎంతోకాలము తనలో ఉన్న ఉత్పాదకశక్థితో (మొక్కగా పుట్టగల శక్తి కలిగి)ఉండలేదు.
ఎన్ని విధాలుగా మహా దుర్మార్గులెందరో భాధపెట్టినను , సహించే లక్షణము భూమిది. భరించలేని స్తితిలో భూదేవి శ్రీమహావిష్ణువు వద్దకు మొరపెట్టుకోటానికి వెళ్ళి మరికొంతకాలము ఆగాలని ఆయనంటే కూడా-ఆగేంతటి సహనశక్తి కలది.

ఇక ఎదురుతిరిగితే (భూకంపము) కొన్ని కోట్ల ప్రజలని క్షణాలలో ఎందుకు కాకూండా చేయగలదు. స్త్రీని భూమితో పోల్చడానికి కారణము ఆమె సహనశీలతా, నిస్సహాయ స్థితిలో ఆమె విజృంభింస్తుంది.

విత్తనాన్ని మొక్కగా మారుస్తుంది భూమి, తనలోని నీటిని అందించి పెద్దగా చేస్తుంది. వృక్షముగా మారుస్తుంది కూడా. ఇలా వృక్షానికి ఆధారమైనది భూమి. అందుకే తన నుండి పెరిగిన వృక్షానైనా, భూకంపం వచ్చినపుడు తనలో లయం చేసుకుంటుంది. భూమి.

ఆడదై పుట్టడం కంటే, అడవిలో మానై పుట్టడం మేలు అనే సామెత ఉంది. "ఆడది" అంటే ఆధార భూతురాలు. అన్నిటి భాద్యతనీ వహించేది అని అర్ధము.

మానుగా పుట్టడంఅంటే, ఆధారంగా భూమి ఉండగా, ఆ ఆధారాన్ని బట్టి పెరగడం ( ఆధేయవస్తువు) కదా!ఆదారంగా వుండటంకంటే ఆధారపడటం మేలని భావం. క్షేత్రమైన స్త్రీకి ప్రాదాన్యము కావున, విధురునికి తండ్రిని బట్టి ( వ్యాసుడు) బ్రాహ్మణ జన్మకాకపోయినది. అలాగే రావణునికి, తండ్రిదైన (పులస్య) బ్రాహ్మణ జన్మ కాక, తల్లి కైకసిని బట్ట్టి క్ష్తత్రీయత్వం వచ్చింది. ఇంతటి ప్రాధాన్యం స్త్రీకి వుందికావునే కన్యనివరించటానికి ఇన్ని ఆంక్షలు అన్నీ స్త్రీ కే పెట్టారు.

ఎంతో కష్టపడి, పొలాన్ని కొని, వర్షం వచ్చేవరకు ఎదురు చూచి వర్షం పడ్డాక భూమిని పదును ఛేసి, చివరికి వెర్రివిత్తనాన్నిఎవరూ ఎలా వేయరో, అలాగే భగవద్ ప్రసాదంగా కుతురుని కని, పెంచి పెద్దచేసి, వెర్రి నాగన్నకి అంటగట్టంకదా! అందుకని వరుని తరుపువారికి ఈ తంతు కన్యా-వరుణమైతే , వదువు తరుపు వారికి కన్యా+ఆవరణ మౌతుందిట.
ఇలా కన్యని వరించి చేసుకున్నాక, ముహుర్తాన్ని నిశ్చయం చేసుకుంటారు. ఇక్కడి నుండి "వివాహం" ప్రారంభమౌతుంది. దీనిలో ముఖ్యమైన ఘట్టాలూ, మంత్రాలూ, అర్ఢమూ,వివరించుకుంటూ వెళదాము మరి.