Thursday, February 12, 2009

ఈ ఐదు జంటలలో మీరే జంట ?

ఏ దంపతులలోనైనా ఇదు విధాలలో ఒకరే అనుకున్నాం కాదా .........
ఒక సారి ఎలాగా అనుకుందాం .
శ్లోకం: లక్ష్మీ నారాయణౌ - గౌరీ శంకరౌ - భారతీ విధి!
చాయాసూర్యౌ - రోహిణీందు - రక్షేతాం వధువరు !
అనికదా శ్లోకం దాని అర్ధం ఇలా ఉహించుకోవాలనే అభిప్రాయంతోనే నారాయణుని గుండెలమీద లక్ష్మీ, శంకారుని మొత్తంలో సగంగా గౌరీ, బ్రహ్మ నాలుక మీద సరస్వతీ............ ఇలా ఉంటారని ప్రచారం చేయడం జరిగిందన్న మాట.
ముందు అనుకున్నట్లుగా ఒకరు గుండెలమీద, ఒకరు చేరిసగంగా, మరొకరు నాలుకమీద...... ఇలా ఉండటం అసాధ్యము- అయితే ఆ ఉండటాన్ని, ఇలా అర్ధము చేసుకోవాలని పెద్దలు చెప్పే మాట. అసలు ప్రాచీనులు, దేన్ని రాసినా, ఇలా పైకి తెలిపోఎలాను, లోపల గంభీరార్ధం ధ్వనిమ్చేలాను, అది కూడా పరిశీలించిన వానికే అంతుబట్టేలా
రాసేవారు.
ఇలాంటి ఐదు జంటలలో ఇంతకీ, మీరు ఏ జంట అయ్యారో ఆలోచించుకున్నారా? ఆ పెళ్ళినాడు ఏ మంత్రాలని ఏమని చదివారో, ఆనాడు చదివిన మంత్రంకు అర్ధము ఏమిటో, అప్పుడు తెలియక పోయినా , ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

No comments: