Wednesday, February 18, 2009

స్త్రీ పురుషులలో స్త్రీయే ..................(౩)

సీతా, ద్రౌపది , సావిత్రి మొదలైన మహా పతివ్రతల చరిత్ర ఏమాత్రము సరిగ్గా తెలియని (దురదృష్ట వశాత్తు కొందరి ఆడువారికే తెలియదు ఇది నా పరిశీలనవల్ల తెలిసింది.) ఆడువారు వాళ్ళమీద చెప్పలేని సాను భూతి చూపిస్తూ, వాళ్ళేదో తమ భర్త వల్ల పడరాని కస్టాలు పడ్డారని వీళ్ళు చాలా భాద పడతారు.
అయితే ఆ సీత- ద్రౌపది-సావిత్రి మొదలైన వాళ్లు మాత్రం మేము మాత్రము ఈ అకష్టాలు మా భర్త వల్ల పడ్డామని, ఏనాడు
వీదులెక్కి అరుచుకొని ఉండలేదు. దీన్ని కొంత కాలం వాళ్లు మరోలా చిత్రించారు. పాతకాలం వాళ్లు అప్పటి స్త్రీలని ఎంతగా అణచి వేశారంటే మాటు పడ్డ కష్టాలని కనీసం చెప్పుకోవడానికి కుడా లేకుండా భయపెట్టారని , ఆ స్త్రీలు భయపద్దరనీను నిజంగా భర్తంటే భయం ఏమాత్రము లేని - అసలు ఉండాల్సిన అవసరం కూడా లేదనీ అనుకొనే ఆడువారు మాత్రమె ఈ తీరు ప్రచారము ప్రారంభించారు.
ఏది ఏమైనా వనాలలో తిరిగిన సీతమ్మ కందమూలాలు ఆరగించిమ్డే కానీ వంటింటి కుందేలు కానే కాలేదు. అదే తీరుగా ద్రౌపది సావిత్రి మొదలిన వాళ్లు కుడా.
ఇక సామాన్యురాళ్ళు అయిన స్త్రీలు కూడ అన్యోన్యంగా జీవిచిన దాఖలాలే పురాణ ఇతిహాసాలలో కనిపిస్తాయి . కానీ, ఏనాడు నేటిలాగా వేరువేరుగా జీవించిన సాక్ష్యాలు కనబడవు. దానికి కారణం వాళ్ళంతా స్త్రీ జాతి పట్ల విశేష ఆదరణ ఉన్నవాళ్ళు స్త్రీకున్నా స్థాయి గౌరవాలు తెలిసినవాళ్ళు కావడమే.
ఒక" స్త్రీ" ని చేర పట్టి ఒకడు లంకకి పట్టుకుని పొతే, మొత్తం లంకలంకనే నాశనం చేయటం, స్త్రీ ఔనత్యానికి పరాకాష్ట , అయితే , ఆ శ్రీ మద్రామాయణాన్నే అపహాస్యం చేస్తూ కొందరు రచించుట దారుణం. అలాగే , అధికారి ఆజ్ఞా మేరకు రాక్షస
స్త్రీలంతా లంకలో ఉన్న సీతని బెదిరించి తమ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చిన తోటి స్త్రీలనే స్త్రీ జాతి గౌరవాభిమానాలతో సీతమ్మ ఆ రాక్షస స్త్రీలని శిక్షించకపోవటం అనేది "ఒక స్త్రీ- తోటి స్త్రీని ఆదరించిం-"దనటానికి నిలువెత్తు సాక్ష్యం . ఇదంతా ఎందుకంటే, స్త్రీకి విలువ- పూర్వకాలంలో ఏ మాత్రమూ తక్కువగా లేనే లేదని చెప్పటానికే.
ఈ రోజులలో అయితే చెప్పనక్కరలేదేమొ. రెండు కొప్పులు కలిస్తె అక్కడ పెద్ద ప్రళయమే అన్నట్టు వుంటుంది.
దాని గురించి ఇంకో సందర్భములో చెప్పుకుందాము.

1 comment:

Unknown said...

బాగా చెప్పారు. మనసులో సందేహమున్నచోట ప్రేయసి జడ కూడా నల్లత్రాచులా కనిపిస్తుంది.