Monday, February 16, 2009

స్త్రీ పురుషులలో స్త్రీయే.....

స్త్రీ పురుషలలో స్త్రీ పేరును ముందుగాను పురుషుని పేరు తరువాత కనిపిస్తుంది. ఇంట్లో ప్రదానురాలు స్త్రీ కాబట్టి, ఇల్లు+ఆలు= ఇల్లాలు అన్నారు. ఇంటి మొత్తానికి యజమానురాలు ఆమె మాత్రమె. స్త్రీలకు ప్రాదాన్యత వుంది కాబట్టి పురుషుడు కుడా స్త్రీ ఇంటికి పోయి మరి పెళ్ళాడి, తన ఇంటికి అతిగౌరవంగా మంగల వాయిద్యాల తో బందు జనులతో కూడి తన ఇంటికి తెచ్చుకుంటారు. అందుకనే "కన్యాదానం" అనే మాట లోకానికి వచ్చింది. "కన్యను దానం చేయడం" అని లోకంలో అర్ధవంతముగా చెప్తారు కాని, "కన్యా+ ఆదానం" (కన్యని , ఆదానం-ఇంటికి తెచ్చుకొనుట) అనేది దీని అర్ధము. స్త్రీ ప్రాధాన్యాన్ని ఈ క్రింది శ్లోకం మరింత జాగ్రత్తగా చెప్తోంది.
ఈ శ్లోకము అందరికీ తెలిసినదే.
పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే!
పుత్రస్తూ వార్ధకే వర్షే, స్త్రీ స్వాతంత్య మర్హతి!!
బాల్యంలో తండ్రి, యౌవనకాలంలో భర్తా, వృద్ధాప్యంలో పుత్రుడు ఆమెని రక్షిస్తారు. కాబట్టి స్త్రీకి స్వాతంత్రం ( అక్కఱ ) లేదు ' అని (మనుస్మృతి ) శ్లోక భావం.
పుర్వకాలంలొ శ్లోకాలన్నీ ఇలాగే ఉంటాయి . లోతుగా అలో చిస్తే తప్ప, అంతరార్ధం భొధపడదు. ఆ అంతరార్ధం తెలియనంత కాలం ఆ శ్లోకాలు అపార్ధాన్ని కుడా కల్పిస్తాయి . ఈ శ్లొకాన్ని ఆధారంగా తీసుకొని ఎందరో స్త్రీలు తమకి స్వాతంత్ర్యం లేనే లేదనీ , పురుషులంతా తమని అలా వంటింటి కుందేళ్ళుగా చూసారనీ . పూర్వం నించి స్త్రీ ని అలాంటి శ్లొకాలద్వారా ఎదగకుండా చేసి ఆమేని మానసికంగా పొట్టిదానిగా చేసారని లేనిపోని ఊహలతో (అపోహలతో మనో వ్యధ చందారు- చెందుతున్నారుకూడా(?) . మనువు కూడా మగవాడే కావునా అలా రాసాడంటారు. అవునా .....
అర్ధవంతమైన శ్లొకం రాసే వారికి ఈ శ్లొకం ద్వారా ఏదైనా అపార్ధం కలుతుందేమొ? అనే ఆలొచన మాత్రం ఉండదా? అందుచేత మనువు స్త్రీలని కొంచపరచడానికి ఈ శ్లొకాన్ని రాసి ఉంటాదనే దృక్పధంతో సత్యాన్వేషణని ప్రారంభిస్తే ఈ శ్లొకానికి సరైయైన అర్ధం మనకి బోదపడి ఆనందమే కలుగుతుంది. ఇలా ఈ శ్లొకాన్ని సరైన అర్ధన్ని కనీసం ఊహిద్దామనే ఊహ కూడ కొత్త కాలపు విమర్సకులకి లేని కారణంగానే ఈ శ్లొకాలకి అపార్ధపు రంగు పులమబదుతోంది. సరే! ఇంతకీ ఈ శ్లొకానికున్న సరైన అర్ధమును తెలుసుకుందాం!.
కాకపోతే ఇంకొసారి తెలుసుకుందాము .
నేను రాసినవి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్నుధయచేసి క్షమించండి .

2 comments:

Kathi Mahesh Kumar said...

తాపీధర్మారావు గారు రాసిన "పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు" చదవండి.

పద్మనాభం దూర్వాసుల said...

మీ వివరణ చాలా అర్ధవంతంగా ఉంది.
ధన్యవాదములు