ఏ దంపతులైనా ఐదు విధాలలో ఒక్కటే ! అందులో మొదటిది లక్ష్మీ నారాయణుల జంట.
శ్రీ మహా విష్ణువుకి వక్ష స్థలం మీద ఉంటుంది లక్ష్మీ దేవి .
వక్షః స్థలంలోని హృదయం ఆలోచనలకి కూడలి.
అక్కడే లక్ష్మీ దేవి వుంటుంది. అంటే .................
ఏ భార్యా భర్తల హృదయం అయినా ఒక్కటై ,
ఆలోచన కుడా ఆ ఇద్దరిదీ ఒక్కటై ఉంటుందో,
ఆ జంట లక్ష్మీ నారాయణుల జంట అవుతుందన్నమాట.ఒకరి ఆలోచనలను ఇంకొకరు పూర్తిగా మనస్పూర్తిగా గౌరవించుతారు .
ఇద్దరి అబిప్రాయాలు ఒక్కగా వుంటాయి . వారి పనులు ఒక్కటిగా వుంటాయి .ఇద్దరు సమానంగా వుంటారు ఒకరు ఎక్కువా మరొకరు తక్కవ అనే ప్రశ్న రానే రాదూ. వీరే లక్ష్మీ నారాయణ జంట అనటంలో ఎటువంటి సందేహములేదు.
ఇలాంటి దంపతులకు తప్పకుండా లక్ష్మీ నారాయణుల ఆశీర్వాధము లభించు గాక.
1 comment:
subhakaramu mee rachana.
Post a Comment