Tuesday, March 31, 2009

వధువు ఎలా వుండాలంటే ?


వధువు ఎలా వుండాలంటే :
అసమానర్షజాం : ఒక్కొక్క గోత్రం , ఏడుగురు ఋషులతో , మరొకటి ఐదుగురు ఋషులుతో ఇలా ఉంటుంది. సమాన ఋషుల గోత్రం కలది కాకూడదు.
ఋషులు సమానమైతే గోత్రము ఒకటౌటుందిగా. ఈ మాటనే అగోత్రజాం అని అన్నారు .
ఒక్కొక్క కన్య లేదా పుత్రుడు మరో ఇంటికి దత్తత పోతారు. అప్పుడు కన్నవారి, పెంపుడు వారి గోత్రాలు రెంటిలో ఏది మనకు వీలయితే అది గ్రహించకుడదు.
అసలు శాస్త్రం ప్రకారము దత్తత పోయిన గోత్రమే తన గోత్రముగా భావించాలి.
ఒకే గోత్రం వాళ్లు తప్పని సరిగా పెళ్లి చేసుకోవలసి వస్తే కొన్ని సందర్బాలలో దురదృష్టవశాత్తు సంభవిస్తే కనుకా (చమత్కారం) కొందరు ఇలా చేస్తున్నారు ( ఒక అరగంట దత్తు మంత్రాలు చదివిచేసి ఆమెని తాత్కాలికంగా దత్తత ఇచినట్లు , చేస్తారు అప్పుడు గోత్రం మారిపోతుంది కదా, ఇప్పుడు పెళ్లిని సగోత్రం కాని పిల్లతో పెళ్లి చేసినట్టు అవుతుంది .)
దత్తు ఇవ్వటం లేదని దత్తు తీసు కొనే వారికీ తెలుసు . దత్తు వెళ్ళటం లేదని దత్తు వెళ్లనని ఆమెకీ తెల్సు. ఈ జరుగుతున్నదత్తు తంతు అంతా అబద్ధమని అందరికీ తెలుసు . ఇంత అబద్దపు దత్తు ని పెళ్ళికి వచ్చిన వారి అందరిముందు చేసి శాస్త్రం ఒప్పుకుమ్టుందని భావిస్తే, ఇలాంటిదత్తు చేయిమ్చిన - చేసిన -వారి తప్పు కానీ ,
శాస్త్రం తప్పుకాదు.
దీని వెనుక రహస్యం అది ఒక Inevitable పెళ్లి . (బలవంతముగా చేసిన పెళ్లి అవుతుంది ట ) ఇది తప్పు.

2 comments:

Unknown said...

అసలు దత్తత సగోత్రీకుల మధ్యే జరగాలని ఒక సిద్ధాంతం వుంది. అలా జరిగితే ఇలాంటి ఇబ్బందే వుండదు కదా..!

Revanth said...

సత్య ప్రసాద్ గారు మీరు చెప్పింది నిజమే. దత్తత సగోత్రికుల మద్యే జరగాలన్న సిద్ధాంతం వుంది. దానిని ఎవరు పాటించుటలేదు కావునే ఇబ్బందులు వస్తున్నాయి.