లక్షణవతీం , యవీయసీం, భ్రాతృమతీమ్ , అసపిండామ్ అగోత్రజామ్ ,బంధుశీల రక్షణ సంపన్నా మరోగామ్, అసమానార్షజామ్, అపూర్ణదశవర్షాం కన్యాముద్వహేత్.
లక్షణవతీమ్- అంటే కన్య ‘లక్షణవతి’ కావాలిట. చూడగానే ‘కన్య’ అనిపించే సహజసిద్దమైన సిగ్గూ, ముగ్ధత్వం మొదలైన లక్షణాలూ, సాముద్రిక శాస్త్రం ప్రకారమ్ సరిపొయే కన్నూముక్కూతీరు కలది కావాలిట.శాస్త్రంలో చెప్పే లక్షణాలు ఉన్నది కేవలం దేవతలికే కాబట్టి, ఈ మాటకి అర్ధం ‘ ఎక్కువ లక్షణాలున్న కన్య’ అనేదే. ఇలా వయస్సుకి తగిన ముగ్ధత్వమూ- సిగ్గూ ఉండటం కన్యకి అందాన్నీ , మృదుత్వాన్నీ ఇస్తాయి. ఈ మద్య పిచ్చి పిచ్చి సినిమాలు పిల్లలను పాడుచేస్తున్నాయి. ఈ సినిమాలు వ్యక్తిలో ఉండే సున్నితపుతనాన్నీ, మృధుత్వాన్నీ పోగొట్టి వెకిలితనాన్ని వ్యక్తికి కలుగ చేస్తున్నాయి.
సరే ఇక యవీయసమ్ -అంటే ‘బలిస్ఠురాలు’ అని అర్ధం . వయసు చేత చిన్నది అని కూడా అర్ధం. బాగా బలం ఉండి, భర్తని ఒక్క గుద్ధుతో పైలోకాలకి పంపించే శక్తి కలదని కాదు.‘ సంతానము కలిగినటువంటి బలమూ- శక్తి కలది’ అని అర్ధం.
భ్రాతృమతీమ్ - అంటే సోదరులు వున్న కన్యని పెళ్ళిచేసుకోవాలిట. ఏదైనా అపార్ధం కారణంగా, వయసుచేత మామగారికీ, స్త్రీ అయిన కారణంగా అత్తగారికీ తెలియజెప్ప వీలు కానప్పుడు. కొన్ని సందర్భాలలొ ఈ కన్య భ్రాతృమతి (సోదరులు కలది) కాబట్టి, దాదాపు వయసు చెత సమానుడైన భావరిది చెప్పుకొని, సమస్యకి పరిష్కారమును సులభముగా సాధించవచ్చు కదా!. అందుకే అలా అన్నారు.
మిగతాది తరువాత.
No comments:
Post a Comment