Monday, March 9, 2009

వధు - వర Bio - Data

వరుని దగ్గరనుండి బయలు దేరిన, ఆ నలుగురు కన్యాదాతల దగ్గరకు వెళ్తారు. అక్కడ ఇలా అంటారు.

చతు స్సాగారపర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-
అంగీరస బార్హస్వత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే -
తైత్తిరీయ శాఖాధ్యాయినే , ఆపస్తంబ సూత్రిణే రామ శర్మణో నప్త్రే, పేరేశ్వర శర్మణ: పౌత్రాయ,
వేంకటేశ్వర శర్మణ: పుత్రాయ, చంద్రశేఖర శర్మణే వరాయ
భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే l

మూడు ఋషులు అధిస్ఠాతలుగా ఉన్న భరద్వాజునితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదము ప్రకారము తన ఇంటి కార్యక్రమాలను నడిపించువాడూ,( శుభాశుభాలు రెండింటినీ), తైతరీయ శాఖనీ, అపస్తంబ సూత్రాన్నీ అభ్యసించి, అనుసరించేవాడూ, రామ శ్రర్మగారి మునిమనుమడూ, పేరయ్యగారి మనుమడూ, వేంకటేశ్వర్లు గారి పుత్రుడూ అయిన చంద్రశేఖరుడు అనే వరునికి, వధువు ను అడుగుటకు వాచ్చాము అని వాళ్ళు అంటారు.

ఇది, పిల్లవానికి సంబంధించిన పూర్తి వివరం. నేడు అదే Bio - Data అని చదివే విధానం, ఆనాటి నుండీ ఉన్నదే తప్పా, వేరేదే కాదు. ఇలా వివరాలు చెప్పడం వలన, కన్యాదాత ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఇవేమీ తెలియక పోతే - ఫలాని వాని మనుమరాలని తెలియక చెసుకున్నాం - అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాము . అని ఇలాంటి మాటలు పుడతాయి. ( మనం కూడా ఇలాంటివి తరచుగా వింటూనే వుంటుంన్నాము కదా).

కన్యాదాత, వరుని ముత్తాత దగ్గర నుండి వివరాలు వింటాడు. ఆ సంబంధం తనకి ఇస్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా పైవిధముగానె చెప్తారు.

No comments: