Ravivarmake andani... |
పల్లవి :
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో (2)
రవి చూడని పాడని నవ్య రాగానివో ll రవి వర్మకే ll
చరణం :
ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్నుదాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై..
ఆ...ఆ..
నీ పాటనే పాడనీ ll రవి వర్మకే ll
చరణం :
ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ..
ఆ ..ఆ ..
కదలాడనీ పాడనీ ll రవి వర్మకే ll
చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
రచన : వేటూరి
సంగీతం : G. k. వెంకటేష్
గానం: S. P. బాలు, S. జానకి .
కవి రచన ఎంతో అందంగా వుంది . రవి వర్మ గొప్ప చిత్ర కారుడు అలాంటి చిత్ర కారునికే అందనంత గొప్పగా వున్న అందం గల ఆమెని వర్ణించుట చాలా బాగుంది . రచనా శైలి అద్భుతంగా అనిపిస్తుంది.
1 comment:
పాట సాహిత్యం బాగున్నాయి. కాని ఒక విచిత్రమేమిటంటే.. ఈ పాటని ANR జయచిత్ర మీద చిత్రీకరించారు. జయచిత్ర మీద ఈ పాటని చిత్రీకరించి రవివర్మ పరువునే తీసారు. ఆమేమో ఒక చిన్న సైజు పర్వతం లాగా ఆ..ఆ..ఆ.. అని అంటూ గిర గిరా తిరుగుతూ, కదులుతూ ఉంటుందాయే.. ఇవతల పాటేమో రవివర్మ కూడా సాధ్య పడదాయే ఆమె అందం ఆకారాని వర్ణించ దానికి... అవును కరెక్టే.. రవి వర్మ కేమి ఖర్మ ఎవరికీ సాద్యం కాదు మరి. (క్షమించాలి ఎవరినైనా నొప్పిస్తే).
Post a Comment