Sunday, March 22, 2009

వధువు ఎలా వుండాలంటే? 2

ముందుగా మనం లక్షణవతీమ్ - యవీయయసమ్ - భ్రాతృమతీమ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు
అసపిండామ్- ఒక్కోవధువు ఒక భాంధవ్యాన్ని బట్టి చూస్తే వివాహానికి వరస అయ్యి, మరో భాందవ్యాన్ని బట్టి చూస్తే చెల్లెల్లు వరస అవుతుంది. ఆమెని సపిండ అంటారు. అలా వరస భేధముతో వున్నా చేసుకోకూడదని అంటారు.
ఇప్పుడలా కాకుండా మార్చేసారు. అమ్మాయి నచ్చిందంటే వెంటనే వరసలు మార్చేస్తున్నారు. పెళ్ళి చేసేస్తున్నారు.
సరే తరువాత. అగ్రోతజామ్-అంటే వధువరులు ఇద్దరూ ఒకే గోత్రం కాకూడదు. అప్పుడు అప్పాతమ్ముళ్ళ వరస కానీ అన్నా చెల్లెళ్ళ వరుస అవుతుంది. వచ్చిన సంబందానికి వంకలు పెట్టుకుని చెడగొట్టుకుంటామా? అని చేసుకుని, తరువాత నూరేళ్ళూ భాధపడడం కంటే, ముందే జాగ్రత్త పడటం మంచిది.
బంధుశీల రక్షణ సంపన్నామ్- అంటే ఆ కన్యకి పెళ్ళి కాగానే ఈ ఇంటి కోడలు అవుతుంది కదా! ఆ సంబంధం వల్ల ఎందరో బందువులు అవుతారు.బందువు అయినవారందరూ మంచి గుణాలు కలిగివుండక పోవచ్చు. అలాటి సంధర్భములో‘ ఫలానీ ఆయన ఇలాగ- ఈయన ఇలాగ ’ అని బందువుల ప్రవర్తన - నడవడిక మొదలైన విషయాలలో వంకర ఎత్తి చూపేదిగా కాక, వాటిని గోప్యంగా ఉంచి. ఇంటి గుట్టు కాపాడేదిగా ఉండాలిట వధువు.
అరోగామ్- అంటే ధేర్ఘరోగాలు తో భాధపడేది కారాదు.
ఇంకా ఉన్నాయి తరువాత ఇంకో సారి వివరించగలను.

No comments: