Tuesday, March 31, 2009

వధువు ఎలా వుండాలంటే ?


వధువు ఎలా వుండాలంటే :
అసమానర్షజాం : ఒక్కొక్క గోత్రం , ఏడుగురు ఋషులతో , మరొకటి ఐదుగురు ఋషులుతో ఇలా ఉంటుంది. సమాన ఋషుల గోత్రం కలది కాకూడదు.
ఋషులు సమానమైతే గోత్రము ఒకటౌటుందిగా. ఈ మాటనే అగోత్రజాం అని అన్నారు .
ఒక్కొక్క కన్య లేదా పుత్రుడు మరో ఇంటికి దత్తత పోతారు. అప్పుడు కన్నవారి, పెంపుడు వారి గోత్రాలు రెంటిలో ఏది మనకు వీలయితే అది గ్రహించకుడదు.
అసలు శాస్త్రం ప్రకారము దత్తత పోయిన గోత్రమే తన గోత్రముగా భావించాలి.
ఒకే గోత్రం వాళ్లు తప్పని సరిగా పెళ్లి చేసుకోవలసి వస్తే కొన్ని సందర్బాలలో దురదృష్టవశాత్తు సంభవిస్తే కనుకా (చమత్కారం) కొందరు ఇలా చేస్తున్నారు ( ఒక అరగంట దత్తు మంత్రాలు చదివిచేసి ఆమెని తాత్కాలికంగా దత్తత ఇచినట్లు , చేస్తారు అప్పుడు గోత్రం మారిపోతుంది కదా, ఇప్పుడు పెళ్లిని సగోత్రం కాని పిల్లతో పెళ్లి చేసినట్టు అవుతుంది .)
దత్తు ఇవ్వటం లేదని దత్తు తీసు కొనే వారికీ తెలుసు . దత్తు వెళ్ళటం లేదని దత్తు వెళ్లనని ఆమెకీ తెల్సు. ఈ జరుగుతున్నదత్తు తంతు అంతా అబద్ధమని అందరికీ తెలుసు . ఇంత అబద్దపు దత్తు ని పెళ్ళికి వచ్చిన వారి అందరిముందు చేసి శాస్త్రం ఒప్పుకుమ్టుందని భావిస్తే, ఇలాంటిదత్తు చేయిమ్చిన - చేసిన -వారి తప్పు కానీ ,
శాస్త్రం తప్పుకాదు.
దీని వెనుక రహస్యం అది ఒక Inevitable పెళ్లి . (బలవంతముగా చేసిన పెళ్లి అవుతుంది ట ) ఇది తప్పు.

Sunday, March 22, 2009

వధువు ఎలా వుండాలంటే? 2

ముందుగా మనం లక్షణవతీమ్ - యవీయయసమ్ - భ్రాతృమతీమ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు
అసపిండామ్- ఒక్కోవధువు ఒక భాంధవ్యాన్ని బట్టి చూస్తే వివాహానికి వరస అయ్యి, మరో భాందవ్యాన్ని బట్టి చూస్తే చెల్లెల్లు వరస అవుతుంది. ఆమెని సపిండ అంటారు. అలా వరస భేధముతో వున్నా చేసుకోకూడదని అంటారు.
ఇప్పుడలా కాకుండా మార్చేసారు. అమ్మాయి నచ్చిందంటే వెంటనే వరసలు మార్చేస్తున్నారు. పెళ్ళి చేసేస్తున్నారు.
సరే తరువాత. అగ్రోతజామ్-అంటే వధువరులు ఇద్దరూ ఒకే గోత్రం కాకూడదు. అప్పుడు అప్పాతమ్ముళ్ళ వరస కానీ అన్నా చెల్లెళ్ళ వరుస అవుతుంది. వచ్చిన సంబందానికి వంకలు పెట్టుకుని చెడగొట్టుకుంటామా? అని చేసుకుని, తరువాత నూరేళ్ళూ భాధపడడం కంటే, ముందే జాగ్రత్త పడటం మంచిది.
బంధుశీల రక్షణ సంపన్నామ్- అంటే ఆ కన్యకి పెళ్ళి కాగానే ఈ ఇంటి కోడలు అవుతుంది కదా! ఆ సంబంధం వల్ల ఎందరో బందువులు అవుతారు.బందువు అయినవారందరూ మంచి గుణాలు కలిగివుండక పోవచ్చు. అలాటి సంధర్భములో‘ ఫలానీ ఆయన ఇలాగ- ఈయన ఇలాగ ’ అని బందువుల ప్రవర్తన - నడవడిక మొదలైన విషయాలలో వంకర ఎత్తి చూపేదిగా కాక, వాటిని గోప్యంగా ఉంచి. ఇంటి గుట్టు కాపాడేదిగా ఉండాలిట వధువు.
అరోగామ్- అంటే ధేర్ఘరోగాలు తో భాధపడేది కారాదు.
ఇంకా ఉన్నాయి తరువాత ఇంకో సారి వివరించగలను.

Thursday, March 12, 2009

వదువు ఎలా వుండాలి ?

లక్షణవతీం , యవీయసీం, భ్రాతృమతీమ్ , అసపిండామ్ అగోత్రజామ్ ,బంధుశీల రక్షణ సంపన్నా మరోగామ్, అసమానార్షజామ్, అపూర్ణదశవర్షాం కన్యాముద్వహేత్.
లక్షణవతీమ్- అంటే కన్య ‘లక్షణవతి’ కావాలిట. చూడగానే ‘కన్య’ అనిపించే సహజసిద్దమైన సిగ్గూ, ముగ్ధత్వం మొదలైన లక్షణాలూ, సాముద్రిక శాస్త్రం ప్రకారమ్ సరిపొయే కన్నూముక్కూతీరు కలది కావాలిట.శాస్త్రంలో చెప్పే లక్షణాలు ఉన్నది కేవలం దేవతలికే కాబట్టి, ఈ మాటకి అర్ధం ‘ ఎక్కువ లక్షణాలున్న కన్య’ అనేదే. ఇలా వయస్సుకి తగిన ముగ్ధత్వమూ- సిగ్గూ ఉండటం కన్యకి అందాన్నీ , మృదుత్వాన్నీ ఇస్తాయి. ఈ మద్య పిచ్చి పిచ్చి సినిమాలు పిల్లలను పాడుచేస్తున్నాయి. ఈ సినిమాలు వ్యక్తిలో ఉండే సున్నితపుతనాన్నీ, మృధుత్వాన్నీ పోగొట్టి వెకిలితనాన్ని వ్యక్తికి కలుగ చేస్తున్నాయి.
సరే ఇక యవీయసమ్ -అంటే ‘బలిస్ఠురాలు’ అని అర్ధం . వయసు చేత చిన్నది అని కూడా అర్ధం. బాగా బలం ఉండి, భర్తని ఒక్క గుద్ధుతో పైలోకాలకి పంపించే శక్తి కలదని కాదు.‘ సంతానము కలిగినటువంటి బలమూ- శక్తి కలది’ అని అర్ధం.
భ్రాతృమతీమ్ - అంటే సోదరులు వున్న కన్యని పెళ్ళిచేసుకోవాలిట. ఏదైనా అపార్ధం కారణంగా, వయసుచేత మామగారికీ, స్త్రీ అయిన కారణంగా అత్తగారికీ తెలియజెప్ప వీలు కానప్పుడు. కొన్ని సందర్భాలలొ ఈ కన్య భ్రాతృమతి (సోదరులు కలది) కాబట్టి, దాదాపు వయసు చెత సమానుడైన భావరిది చెప్పుకొని, సమస్యకి పరిష్కారమును సులభముగా సాధించవచ్చు కదా!. అందుకే అలా అన్నారు.
మిగతాది తరువాత.

Monday, March 9, 2009

వధు - వర Bio - Data

వరుని దగ్గరనుండి బయలు దేరిన, ఆ నలుగురు కన్యాదాతల దగ్గరకు వెళ్తారు. అక్కడ ఇలా అంటారు.

చతు స్సాగారపర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-
అంగీరస బార్హస్వత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే -
తైత్తిరీయ శాఖాధ్యాయినే , ఆపస్తంబ సూత్రిణే రామ శర్మణో నప్త్రే, పేరేశ్వర శర్మణ: పౌత్రాయ,
వేంకటేశ్వర శర్మణ: పుత్రాయ, చంద్రశేఖర శర్మణే వరాయ
భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే l

మూడు ఋషులు అధిస్ఠాతలుగా ఉన్న భరద్వాజునితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదము ప్రకారము తన ఇంటి కార్యక్రమాలను నడిపించువాడూ,( శుభాశుభాలు రెండింటినీ), తైతరీయ శాఖనీ, అపస్తంబ సూత్రాన్నీ అభ్యసించి, అనుసరించేవాడూ, రామ శ్రర్మగారి మునిమనుమడూ, పేరయ్యగారి మనుమడూ, వేంకటేశ్వర్లు గారి పుత్రుడూ అయిన చంద్రశేఖరుడు అనే వరునికి, వధువు ను అడుగుటకు వాచ్చాము అని వాళ్ళు అంటారు.

ఇది, పిల్లవానికి సంబంధించిన పూర్తి వివరం. నేడు అదే Bio - Data అని చదివే విధానం, ఆనాటి నుండీ ఉన్నదే తప్పా, వేరేదే కాదు. ఇలా వివరాలు చెప్పడం వలన, కన్యాదాత ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఇవేమీ తెలియక పోతే - ఫలాని వాని మనుమరాలని తెలియక చెసుకున్నాం - అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాము . అని ఇలాంటి మాటలు పుడతాయి. ( మనం కూడా ఇలాంటివి తరచుగా వింటూనే వుంటుంన్నాము కదా).

కన్యాదాత, వరుని ముత్తాత దగ్గర నుండి వివరాలు వింటాడు. ఆ సంబంధం తనకి ఇస్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా పైవిధముగానె చెప్తారు.

Sunday, March 8, 2009

మీ ప్రయాణం సుఖకరము అగుగాక !

వరుడు ఆ రోజుల్లో పెళ్లికుతురుని వెతకటానికి వెళ్ళే నలుగురితో ఇలా అంటాడు. మీ ప్రయాణము సుఖకరముఅగు గాక !(Wish you a happy journey!) అని ఈ రోజులలో అనేమాటనే నాటి ఋ గ్వేద కాలమునాటి మాట.
" ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి వరేభి ర్వరాగ్o అభిషు ప్రసీద l
అస్మాకమింద్ర ఉభయం జుజోతి l యత్సౌమ్య స్యాంధసో బుబోధతి l
అనృక్షరా జవ స్సంతు పన్దా యేభి స్సఖా యో యాన్తి నో వరేయం l ..............
అని ఇలా వుంటుంది మంత్ర రాజము.

ఓ ! స్నేహితులారా ! వేగము కలవారై , బుద్ధిమంతులై, నా మనసు తెలిసినవారై న మీరు సంతోషముగా బయలుదేరి వెళ్లవలసినదిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. వరుడు, వధువు అలాగే వీళ్ళిద్దరికీ వివాహమైతే, ఆ వివాకాలము లో ఇచ్చే" హవిస్సు "అగ్ని గుండములో మంత్రాలతో వేసే నెయ్యి ఇంద్రునికి కుడా లభిస్తుంది కాబట్టి , ఆ ఇంద్రుడు కుడా మీకు సహాపడుతూ అలా నాకు కుడా సహాయపడతాడు. మీరు వల్లలేని దారులలో కుడా ఎవిధమైనా రాళ్ళు రప్పలు , పల్లేరుకాయలు లేకుడా ఉండాలని, దారి తిన్నగా వుంది, మీ ప్రయాణం సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను.
అని వరుడు వెళ్ళే నలుగురి తో అంటాడు.

ఆర్యముడు, భగుడు అనే పేరుగల దేవతలు కుడా, మీకు సహాయ పడవలెనని ప్రార్ధిస్తున్నాను, మీ ప్రయాణము సులభ,సుఖకరమై, ఫలవంతము అగుగాక! అని పలుకుతాడు.
రోజు లలో అలాంటి పద్దతులు లేవులేండి. online లో పెళ్లి సంబందాల సైట్లకు డబ్బులు కట్టేసి అమ్మాయా photos చూడటం నచ్చితే ఫోన్ తో సరాసరి మాటలాడటం. అన్నీ short cut పాద్దతులే కదా.
ఎంతో మర్యాదా, పధ్ధతి తెలుస్తాయి . వేదం చదివితే- లేదా - వేదార్ధం విన్నా . దాన్నే నిత్యం మననం చేస్తే సత్ హృదయం లభిస్తుంది.

Friday, March 6, 2009

కన్యని వరించటం ఎలా? (2)

కన్యని వరించటం :
నలుగురిని పంపటంలో కుడా ఒక విషయం వుంది. పూర్వులు కుడా ఎప్పుడు "సరి సంఖ్య " ఆదరించేవారు. గృహానికి ఉండే కిటికీలు, ద్వారాలు, అన్నీ సరి సంఖ్యలోనే ఉండాలని. సృష్టిలో ఏది ఒక్కగా వుండరాదని. అన్నీ జంటగా వుండాలని వాళ్లు అనుకునేవారు.
లోకంలో కుడా " నలుగురు నడిచేదారి , పదిమందిని పిలుచుకోవాలిగా! - వంద అబద్దలాడినా - వెయ్యి చెప్పినా నీ మాట వినను " అనేతతువంతి సామేతలులో కుడా బేసిసంఖ్య లేదు. గమనించారా. ఎ కార్యక్రమానికైనా పురోహితులు ఒక్కరే అయితే, వివాహానికి మాత్రం ఇద్దరు వుంటారు. వధువు వైపునుండి ఒకరు, వరుడు వైపునుండి ఒకరు పురోహితులుంటారు. అనావసరంగా ఇద్దరు బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వటం ఎందుకని , ఒకరిని చేసి - ఏది వద్దంటే అది చేయటం నేటి సాంప్రదాయము.
తరువాత తేడాలు వస్తే, మంత్రాలు - తంత్రాలు అన్నీ అబద్దాలే అనటం మనకి మామూలే కదా.
నలుగురిని పంపడంలో ఒక విశేషం వుండను కున్నాము కదా అదేమిటంటే , " ఎన్నిక" సమస్య ( voting system) రారాదని. కొన్ని కొన్ని సమస్యలు వచ్చినపుడు మేధావులు కొందరు voting పెడతారు. వెళ్ళేది ఐదుగురనుకుందాము . ఎవరో ఓ లంఖిని బాగుందని ముగ్గురు అంటే , చచ్చినట్లు వాడికి కట్ట బెట్టవలసిదే కదా. అప్పుడు ఆ పిల్లాడి పరిస్తితి ఏమైపోతుంది . అందువల్ల పెళ్లి వంటివాటికి ఓటింగు పరిస్థిటి కుదరదు.
అందుకే వేదం చెప్పింది.
"హితకారిభి రే వాసౌ జ్ఞాయమాన ప్రవర్తకః
హితకారిభి: భిగ్భి: జ్ఞాయమాన స్సన్ రోగీ "
అని. దానిలో అర్ధం తెలియాలి.తిండి తినకుదని రోగం వచ్చింది ఒకడికి. వందమంది అతనిని చూడటానికి ఒచ్చారు రోగికదా. తొంభై తొమ్మిది మంది తిండి పెట్టకూడదు అని అన్నారు. పోనీ ఏభైఒక మంది తిండి తినకూడదు అన్నారు . మరి అలాగే voting ప్రకారము తిండి పెడితే రోగి హరీ అని అనడా? ఎక్కువ మంది ఏది అంటే అది అమలు చేసేసి న్యాయం చేసాము అని అనుకోకుడదని వేదం చెబుతోంది.
అందుకని, నలుగురికి ఒకే నిర్ణయం కలిగితేనే వధువు నచ్చినట్లు . అంటే కానీ 3+1 అనే సిద్దాంతం ద్వారా ఒకడు కాదు అని , సంసారం కూలిన ప్రతి పక్షంలో కూచొని, నేను ముందే చెప్పాను విన్నారా? అనటం సరి అయినది కాదు.

Thursday, March 5, 2009

కన్యని వరించటం ఎలా? (!)

కన్యని వరించటం :
చాలా మంది అనుకుంటున్నారు నవలలోని , ఏవో సినిమాలాల్లోలా, రోడ్లమీద జులాయిలా తిరుగుతూ ప్రేమని నటించుతూ ఉండటమే వరించటము అని . కానీ ప్రాచీనుల ద్రుష్టి ఎంత దూరమో , ఎంత గంభీరంగానో ఉంది.

" సుహృదస్సమవేతాన్ మంత్రవతో పరాన్ ప్రహిణుయాత్ " పెళ్లి చేసుకోబోయే వరుణ్ణి బాగా ఎరుగున్నవాళ్ళు, ధర్మబుద్ధితో కూడిన ఆలోచన కలవాలు అయిన నలుగురికి తాంబులాలనిచ్చి, కన్యని వెతుక్కుని రమ్మని పంపించాలిట .

వరుడే ఎందుకు పోరాదని ప్రశ్న. యవ్వనంలో ఉంది పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే ఉన్న వరుడు "కన్యావరనానికి " వెళితే
సుర్పనఖని ముస్తాబు చేసి `సీతమ్మ" లా కూచో బెడితే ! -ఆమెనే పెళ్ళాడుతా అని మొండికేస్తే. ఆమ్మాయి గుణగణాలు తెలుసుకునే వయస్సు కాదు. లేదా కన్యలని చూస్తూ ఉండడాన్ని ఒక వినోదంగా( కొందరున్నారు ఇలాంటి వారు) భావిస్తూ వివాహానికి ఏ అమ్మాయినీ నిర్ణయించుకోలేకనూ పొవచ్చు.
అందుకనే, వౌని గుణగణాలుని ఎరుగున్నవాళ్ళే పోవాలి, ఆ కన్య లక్షణాలు చుచి, ముందు బౌతికంగానూ (అంటె పొడుగూ పొట్టి- లావు సన్నము - చాయావంటివి) ఆ మేదట, ఎరుగున్నవాళ్ళు ద్వారా ఆమె గుణగణాలుని తెలుసుకు, ఇద్దరికీ పొతనని ( జాతకాలు వగైరా ) నిర్ణయిస్తారు. వరుడు కోపస్వభావి కలవాడు అని తెలిసిన వీళ్ళు , ఆమె గుణగణాల్ని విచారించి, ఆమె కూడా అలాంటిదే అని విచారణమీద తెలిస్తె, సంబందాన్ని విరమిస్తారన్న మాట. ఇద్దరు ఒకలా ఉంటె రోజూ ఆ ఇంటి వాతావరణం యుద్దభూమిని తలపిస్తుంది కదా మరి అందుకే, అందుకే వివాహ నిర్ణయం చేయటానికి ధర్మబుద్ది, సరియైన అలోచనా కలిగిన వాళ్ళని పంపడం జరుగుతుంది.

Tuesday, March 3, 2009

వివాహానికి ముందు ఏమి చెయ్యాలి ?

ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే దానిక్కవలసిన ముడి పదార్ధాలు సిద్ధము చేసుకున్నట్లు, వివాహానికి ముందు కూడా యోగ్యురాలైన కన్యని పరీక్షించి నిర్ణయం తీసుకోవాలి అని శాస్త్రం చెబుతున్నది. దాన్నే కన్యా వరణం (కన్యని ఎన్నుకోవటం -కన్యని ఎన్నుకోవటం) అని అంటారు.
ఇది పెళ్ళికి ముందే జరిగేది అయినా, ఈ జరిగే పెళ్ళికి ఆధారభుతులు కన్యని వెదికి వెదికి పరీక్షించి తెచ్చేవాళ్ళు కాబట్టి, వాళ్ళని వివాహానికి వచ్చిన బందువులకి పరిచయం చేయటం కోసము పెళ్ళిలో ఒక ఘట్టం గా చేసారు. పెళ్లి కూతురుని తెచ్చే గంపని మేదరి సిద్ధం చేస్తాడు. ఆ మేదరికి సన్మానం జరుగుతుంది. ఇదే పెళ్ళిలో కుమ్మరి, వివాహానికి కావలసిన కొత్త కుండలను సిద్ధము చేస్తాడు. అతనికి సన్మానం చేస్తారు ఈ పెళ్ళిలోనే . వధువు మెడలోని తాళి బొట్టును చేస్తాడు కంసాలి. అతనికి అక్కడే సన్మానం చేస్తారు. అలాగే ఇత్తడి చెంబుల్ని ( కలశాలను) చేసినకమ్మరి కి , పందిళ్ళు వేసిన చాకలికి, అలాగే తలంబ్రాలు బియ్యం తేవటం తో పాటు ఇతర పనులు చేసినటువంటి ఇంటి చాకలికి, మంగల వాయిద్యాలు వాయించిన మంగలి( అందుకే వారికి ఆపేరువచ్చింది) . కాలిగోళ్ళు తీసిన మంగలికి కుడా ఆ వివాహ వేదికమీడనే సన్మానం చేస్తారు. ఆ రోజుల్లో ఇలా ఇన్ని కుల్లాల వారికి ఒకే వేదిక మీద ఓ మంచి వివాహం లోమంగల వాయిద్యాల మద్య సన్మానం జరుగుతున్నా కారణంగా- ఎక్కువ తక్కువ కులాలు అన్నా తేడ లేకుండా ఆ ఇంటి పురోహితుడు అందరికీ సమానంగా సన్మానం జరిగే టట్టు చూస్తాడు. అలాంటప్పుడు కుల ప్రసక్తి లేకుండా వివాహ వేడుకలో ఈ సన్మానం అన్నది ఒక పరిచయ వేడుకలా జరుగుతుంది.
ఇవి ఆ రోజులలో జరిగేవి ఇప్పుడు ఆ పద్దతులే లేకుండా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. పెళ్లి తొందరగా జరిగిపోవటం. ఢేకరేషనులు , ఫోటోలు వీటిమీదే ద్యాస మారిపోయింది కాని ఈ పరిచయాలు జరిగే విదానంలు మారిపోతున్నాయి.