Friday, April 24, 2009

వధువు ఎలా వుండాలంటే?

అపూర్ణ దశవర్షామ్- పది సంవత్సారాలు నిండని కన్యని చేసుకోవాలని అపస్తంబుడంటాడు. ఈ విషయం ప్రస్తుత కాలానికి పూర్తిగా విరుద్ధము. అసలు ఎందుకు అలా అన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
ఈరోజుల్లో లాగా పిచ్చి సినిమాలు- వెర్రి నవలలు లేని కాలము అది.మూడవ తరగతి పిల్లల నుండి ప్రేమలూ- పెళ్ళీళ్ళూ-స్త్రీలని అసభ్యంగా చిత్రీకరించటాలు తెలిసిన కాలమిది. ఆనాడు అటువంటి ద్యాసే వుండని రోజులు అవి.
అందుచేత, భర్తతోనే లోకం అనే అభిప్రాయాన్ని వాళ్ళకి కలిపించటానికి వీలుగా, ఊహ వచ్చిన కాలంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. వరుళ్ళు కూడా సంస్కారవంతముగానే , ఆరొగ్యప్రధమైన చదువులు చదివిన కారణముగా నియమనిబందనగానే ఉండేవారు తప్ప , స్త్రీ విషయంలో పాపపు ఆలోచనె కలిగి వుండేవారు కారు.
ఈ పది సంవత్సరాలు నిండని పిల్లకి చిన్నప్పటినుండే సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు వీలైన విధంగా చెక్కతో చేయబడిన వంట పాత్రలూ, గరిటెలూ, ఇల్లూ- భర్తా- తల్లీదండ్రులూ-అత్తా మామలూ- నుయ్యీ -రోలూ -రోకలీ మొదలైన బొమ్మలు సమకూర్చేవారు. ( అవేనండీ లక్కపిడతలు అని అనేవారు) .
అంటే, అప్పటి నుండే గృహిణీ భాధ్యతని, బొమ్మలాటల ద్వారా నేర్పుతూ గుర్తుచేస్తూండేవారు.
తమకి ఓ ప్రత్యేకమైన అభిప్రాయాలు అంటూలేని వయస్సు పది సంవత్సరాలు వయసు కావున, సంసారాలు సజావుగా సాగిపోయేవి.
ఈమెకి ముప్పైఏళ్ళు వచ్చి, కొన్ని మహా స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడ్డాకా, అత్యంత స్థిరమైన అభిప్రాయాలు ఆయనికి ఏర్పడ్డాకా, వీళ్ళిద్దరికీ, పెళ్ళి చేస్తే. ఎవరి మనోభిప్రాయాలు వాళ్ళవే, కలుసుబాటుతనం లేక రొజూ పామూ ముంగీస లాగా కాపురం చేయటమే ఔతొంది కదా, అయితే అందరూ ఇలా కాదులేండి. కొందరు ఇలా.
మిగతాది ఇంకోసారి చెప్పుకుందాము.

No comments: