Tuesday, May 19, 2009

స్త్రీ కే ఇన్ని పరీక్షలా ?

`కన్య' ని అన్ని విధాలుగా పరీక్షించి, ఇన్ని పరీక్షలలోను నెగ్గితేనే గ్రహించాలా? అసలు స్త్రీకే ఇన్ని పరిక్షలెందుకు? పురుషుడికి లేవా? అతడెలా ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు కాని, కన్యని మాత్రం ఈ అవలక్షనాలున్నది కానే కారాదా? ఇవన్నీ పురుషులు వ్రాసి ఉండడం వలీ, పక్షపాత బుద్దితో ఇలా రాసి వుంటారా? అని కొందరు మేధావులు భావిస్తూ వాపోతూ వుంటారు కూడా.
ఈ కాలంలో ఇదేమీ విచిత్రమో తెలియదు కానీ. సంస్కృతము రాదు. ఆ మంత్రానికి అదే అర్ధమో? కాదో ? అంతకన్నా తెలియదు- ఎవరో `దీని అర్ధం ఇదట' అని చెపితే, ఇక ఆ మాట మీద , -చిలవలు - పలవలు - అల్లీ, `ఇవేమీ మంత్రాలు?'అంటువుంటారు . అలాంటి ప్రశ్నల వంటిదే ఇది కూడా.
స్త్రీ విలువైనది - అని ఇంతకముందు అనుకున్నాము . అందుకనే ఇన్ని పరీక్షలు. ఇత్తడి గిన్నెని కొనుక్కురావటానికి వేదిలోని సలహా అక్కరలేదు కానీ, బంగారము గొలుసు కొనుక్కొనేటప్పుడు మాత్రము పది మందిని అడిగి అడిగి కొనడం సరైనదే అని ఒప్పుకుంటాము కదా! అంతటి ఉత్తమురాలు స్త్రీ కావునా ఇంటికి తెచ్చుకునే టప్పుడు అంతగా ఆలోచించడం.
పరీక్షలని అన్నింటిని చేయటం చాలా తప్పు. - పురుషులు రాయడం వల్ల వచ్చుంటుంది - అనే వాదన మాత్రము సరిగాదు. సరికదా, ఏ కొందరిలో నున్న వివాహం పట్ల ఉన్నా విస్వాసభావాన్ని తొలగించటమే అవుతుంది కూడా.

2 comments:

Vinay Chakravarthi.Gogineni said...

baagundi.............

జాహ్నవి said...

నమస్కారం అండీ.
మీ బ్లాగుని ఇదే మొదటి సారి చూడడం. మొత్తమ్ పోస్ట్ లు అన్నీ చదివాను. మంచి అంశాన్ని ఎంచుకున్నారు. ఇప్పటి తరం వారికి పెళ్ళి గురించి చెప్పే మీ ప్రయత్నం చాలా బాగుంది. అభినందన మందార మాల మీకు.
- జాహ్నవి
http://www.jaahnavi.blogspot.com