ఈడగుపెండ్లి
ప: ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము | చేడెలాల ఇది చెప్పరుగా ||
చ: పచ్చికబయళ్ళ పడతి ఆడగ | ముచ్చట కౄష్ణుడు మోహించి |
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట | గచ్చుల నాతని కానరుగ ||

చ: ముత్తెపు ముంగిట ముదిత నడువగ | ఉత్తముడే చెలి వురమునను |
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక | జొత్తుమాని ఇటు జూపరుగా ||

చ: కొత్తచవికెలో కొమ్మనిలిచితే | పొత్తున తలబాలు వోసెనట |
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు | హత్తి సతిగూడె నని పాడరుగా ||