Tuesday, March 30, 2010

అలనాటి రామచంద్రుడు కన్నింట సాటి





||ప||
ఆ… ఆ… ఆ… ఆ…
అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి ||అలనాటి||
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
ఆ… ఆ… ఆ… ఆ…
తెలుగింటి పాలసంద్రం కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ ||తెలుగింటి||
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
ఆ… ఆ… ఆ… ఆ…
||ఖోరస్||
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా

మా అన్నుల మిన్నకు సరిరాలేరని వెలవెలబోవమ్మా||చ||
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ వ్రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపున ముద్దగా తడిసిన తుంటరి జలకాలు
అందాల జంట అందరికంటికి విందులు చేసే సమయాన
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
అందాల జంట అందరికంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడిచూపుల అక్షితలేయండి
||చందమామ||
.
||చ||
సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరిశంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగ లేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
ఆ… ఆ… ఆ… ఆ…
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
||చందమామ||

1 comment:

Unknown said...

"మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా" కాదమ్మా.. "మా అన్నుల మిన్నకు సరిరాలేరని వెలవెలబోవమ్మా" :) Nice song! గుర్తు తెచ్చినందుకు థాంక్స్.. :)