పెళ్ళి ముచ్చట్లు
{ పెళ్ళి మంత్రాలకి వివరంగా అర్ధం + వ్యాఖ్య+ చిటికెడు హాస్యంతో కలసి వెలసి.}
Wednesday, November 9, 2011
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా
అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను
యెల్లినేడే పెండ్లాడీ నిదివో నిన్ను
యెల్లగా జనకుడు నిన్నిచ్చీనట వీడె
వెల్లవిరి నీమాట వినవమ్మా
అదె పెండ్లితెర యెత్తి రండనే వశిష్టుడుండి
చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా
మొదల రాముని కంటె ముంచి తలంబ్రాలు వోసి
సుదతి యాతని మోము చూడవమ్మా
కంకణదారాలు గట్టి కాలుదొక్కితివి మీరు
పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ
వుంకువ వావిలిపాట నుండి శ్రీవేంకటగిరి
తెంకుల నిన్ను గూడి తిరమాయనమ్మా
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)