Thursday, July 23, 2009

గణఫతి పూజ


ప్రారంభములో సాగేది గణాధిపతి పూజ, దీన్నే గణపతి పూజ అని అంటారు. వైష్ణవులు అయితే విష్వక్సేన పూజ అంటారు.
శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః

అనే విషయాన్ని గమనెస్తే, శివకేశవ భేధమే లేదు కావున, రెండూ ఒకటే అవుతాయి. రోజు సంద్యావందనంలో ఈ శ్లోకాన్ని చదివి కూడా, బేధం ఉందని భావిస్తే, చెప్పేది ఏమీలేదు.

1) దేవీం వాచ మజనయంత దేవాః- అయం ముహుర్తః సుముహూర్తో అస్తు

2) య శ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళాl
తయో స్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగలమ్ll

౩) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్l
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేll
అని ఈ తీరుగా మంగల శ్లోకాలు వెడలుతాయి ప్రారంభములో, వరుసగా అర్దం చూద్దాం.

Thursday, July 16, 2009

కళ్యాణం కమనీయం.

కళ్యాణం! అనే పదంలో ఎంతో మధురంగా వుంటుంది. ప్రతీ మనిషి జీవితంలోను ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడ్క జీవితానికంతటికీ మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్బ్జుత క్షణం ఒక అసాధరణమైన, అనుభూతి. ఈకళ్యాణ్ ఘఢియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. భాద్యత యుతమైన పౌరుడిగా కుటుంబంలోను, అటు సంఘములోను కూడా ఒక గుర్తింపును కలగ జేసేది కళ్యాణమే!! ఎన్నెన్నో సుఖాలు, కష్త్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటిని ఒకరికొకరు సమానంగా పంచుకిని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణంవెనుక ఉన్న పరమార్హ్దం. ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక ఉన్న అర్ధమూ ఇదే!!! వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్ళీకి ఏయే దేవతలొస్తారో, వారివెంట ఎవరొస్తారో తెలుసుకుందాం.!!!
సరేనా అయితె ఇప్పుడుకాదు తరువాత post లో నుండి .

Tuesday, July 14, 2009

భీజక్షేత్ర ప్ర్రాధాన్యం


భీజం అంటే విత్తనం. క్షేత్రము అంటే భూమి. పురుషుణ్ణి విత్తనంతోను. స్త్రీని క్షేత్ర,ము గాను పోల్చారు. ప్రాచీనులు .భూమి , భూమిగా ఎంతకాలమైన ఉండగలదు. కాని, విత్తనం ఎంతోకాలము తనలో ఉన్న ఉత్పాదకశక్థితో (మొక్కగా పుట్టగల శక్తి కలిగి)ఉండలేదు.
ఎన్ని విధాలుగా మహా దుర్మార్గులెందరో భాధపెట్టినను , సహించే లక్షణము భూమిది. భరించలేని స్తితిలో భూదేవి శ్రీమహావిష్ణువు వద్దకు మొరపెట్టుకోటానికి వెళ్ళి మరికొంతకాలము ఆగాలని ఆయనంటే కూడా-ఆగేంతటి సహనశక్తి కలది.

ఇక ఎదురుతిరిగితే (భూకంపము) కొన్ని కోట్ల ప్రజలని క్షణాలలో ఎందుకు కాకూండా చేయగలదు. స్త్రీని భూమితో పోల్చడానికి కారణము ఆమె సహనశీలతా, నిస్సహాయ స్థితిలో ఆమె విజృంభింస్తుంది.

విత్తనాన్ని మొక్కగా మారుస్తుంది భూమి, తనలోని నీటిని అందించి పెద్దగా చేస్తుంది. వృక్షముగా మారుస్తుంది కూడా. ఇలా వృక్షానికి ఆధారమైనది భూమి. అందుకే తన నుండి పెరిగిన వృక్షానైనా, భూకంపం వచ్చినపుడు తనలో లయం చేసుకుంటుంది. భూమి.

ఆడదై పుట్టడం కంటే, అడవిలో మానై పుట్టడం మేలు అనే సామెత ఉంది. "ఆడది" అంటే ఆధార భూతురాలు. అన్నిటి భాద్యతనీ వహించేది అని అర్ధము.

మానుగా పుట్టడంఅంటే, ఆధారంగా భూమి ఉండగా, ఆ ఆధారాన్ని బట్టి పెరగడం ( ఆధేయవస్తువు) కదా!ఆదారంగా వుండటంకంటే ఆధారపడటం మేలని భావం. క్షేత్రమైన స్త్రీకి ప్రాదాన్యము కావున, విధురునికి తండ్రిని బట్టి ( వ్యాసుడు) బ్రాహ్మణ జన్మకాకపోయినది. అలాగే రావణునికి, తండ్రిదైన (పులస్య) బ్రాహ్మణ జన్మ కాక, తల్లి కైకసిని బట్ట్టి క్ష్తత్రీయత్వం వచ్చింది. ఇంతటి ప్రాధాన్యం స్త్రీకి వుందికావునే కన్యనివరించటానికి ఇన్ని ఆంక్షలు అన్నీ స్త్రీ కే పెట్టారు.

ఎంతో కష్టపడి, పొలాన్ని కొని, వర్షం వచ్చేవరకు ఎదురు చూచి వర్షం పడ్డాక భూమిని పదును ఛేసి, చివరికి వెర్రివిత్తనాన్నిఎవరూ ఎలా వేయరో, అలాగే భగవద్ ప్రసాదంగా కుతురుని కని, పెంచి పెద్దచేసి, వెర్రి నాగన్నకి అంటగట్టంకదా! అందుకని వరుని తరుపువారికి ఈ తంతు కన్యా-వరుణమైతే , వదువు తరుపు వారికి కన్యా+ఆవరణ మౌతుందిట.
ఇలా కన్యని వరించి చేసుకున్నాక, ముహుర్తాన్ని నిశ్చయం చేసుకుంటారు. ఇక్కడి నుండి "వివాహం" ప్రారంభమౌతుంది. దీనిలో ముఖ్యమైన ఘట్టాలూ, మంత్రాలూ, అర్ఢమూ,వివరించుకుంటూ వెళదాము మరి.

Tuesday, May 19, 2009

స్త్రీ కే ఇన్ని పరీక్షలా ?

`కన్య' ని అన్ని విధాలుగా పరీక్షించి, ఇన్ని పరీక్షలలోను నెగ్గితేనే గ్రహించాలా? అసలు స్త్రీకే ఇన్ని పరిక్షలెందుకు? పురుషుడికి లేవా? అతడెలా ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు కాని, కన్యని మాత్రం ఈ అవలక్షనాలున్నది కానే కారాదా? ఇవన్నీ పురుషులు వ్రాసి ఉండడం వలీ, పక్షపాత బుద్దితో ఇలా రాసి వుంటారా? అని కొందరు మేధావులు భావిస్తూ వాపోతూ వుంటారు కూడా.
ఈ కాలంలో ఇదేమీ విచిత్రమో తెలియదు కానీ. సంస్కృతము రాదు. ఆ మంత్రానికి అదే అర్ధమో? కాదో ? అంతకన్నా తెలియదు- ఎవరో `దీని అర్ధం ఇదట' అని చెపితే, ఇక ఆ మాట మీద , -చిలవలు - పలవలు - అల్లీ, `ఇవేమీ మంత్రాలు?'అంటువుంటారు . అలాంటి ప్రశ్నల వంటిదే ఇది కూడా.
స్త్రీ విలువైనది - అని ఇంతకముందు అనుకున్నాము . అందుకనే ఇన్ని పరీక్షలు. ఇత్తడి గిన్నెని కొనుక్కురావటానికి వేదిలోని సలహా అక్కరలేదు కానీ, బంగారము గొలుసు కొనుక్కొనేటప్పుడు మాత్రము పది మందిని అడిగి అడిగి కొనడం సరైనదే అని ఒప్పుకుంటాము కదా! అంతటి ఉత్తమురాలు స్త్రీ కావునా ఇంటికి తెచ్చుకునే టప్పుడు అంతగా ఆలోచించడం.
పరీక్షలని అన్నింటిని చేయటం చాలా తప్పు. - పురుషులు రాయడం వల్ల వచ్చుంటుంది - అనే వాదన మాత్రము సరిగాదు. సరికదా, ఏ కొందరిలో నున్న వివాహం పట్ల ఉన్నా విస్వాసభావాన్ని తొలగించటమే అవుతుంది కూడా.

Tuesday, May 5, 2009

వధువు ఎలా వుండాలంటే?

చిన్న తనం లో వివాహాలు చేయటమే సరియైన పద్ధతని ఆ రోజులలో వారు భావించేవారు. ఆనాటి కాలము, ఆలోచనా ధోరణీ, పెద్దల చెప్పు చేతలలో వినయంగా పడి ఉండడం వల్ల, ఈ నాటి వాలు అనుకునే విధముగా, చిన్నతనంలో తల్లులు కావడం వంటివి ఉండేవి కావు. అయినా కుడా ఆ కాలమో వాళ్లు జీవించినంత ఆరోగ్యంగా , ఇంత ఆలోచించి చేసుకునే
ఈ నాటి వాళ్లు ఉన్నారేమో ఆలోచించితే , అందరికీ నిజం తెలుస్తుంది.
వారి సారాంసం ఏమిటంటే, భర్తని గౌరవిచేడిగా కన్య ఉండాలని. భార్య ఆరోగ్యాన్ని గమనించి పిల్లల్ని కనేవాడు గా భర్త వుండాలి. అలాంటి కన్య ఔనా ? కాదా? అనే పరిశీలనా ఈ నలుగురూ చేయాలి. పాచీనపు ఆచారాలలోని సదాభిప్రాయాని గుర్తించాలి.

Friday, April 24, 2009

వధువు ఎలా వుండాలంటే?

అపూర్ణ దశవర్షామ్- పది సంవత్సారాలు నిండని కన్యని చేసుకోవాలని అపస్తంబుడంటాడు. ఈ విషయం ప్రస్తుత కాలానికి పూర్తిగా విరుద్ధము. అసలు ఎందుకు అలా అన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
ఈరోజుల్లో లాగా పిచ్చి సినిమాలు- వెర్రి నవలలు లేని కాలము అది.మూడవ తరగతి పిల్లల నుండి ప్రేమలూ- పెళ్ళీళ్ళూ-స్త్రీలని అసభ్యంగా చిత్రీకరించటాలు తెలిసిన కాలమిది. ఆనాడు అటువంటి ద్యాసే వుండని రోజులు అవి.
అందుచేత, భర్తతోనే లోకం అనే అభిప్రాయాన్ని వాళ్ళకి కలిపించటానికి వీలుగా, ఊహ వచ్చిన కాలంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. వరుళ్ళు కూడా సంస్కారవంతముగానే , ఆరొగ్యప్రధమైన చదువులు చదివిన కారణముగా నియమనిబందనగానే ఉండేవారు తప్ప , స్త్రీ విషయంలో పాపపు ఆలోచనె కలిగి వుండేవారు కారు.
ఈ పది సంవత్సరాలు నిండని పిల్లకి చిన్నప్పటినుండే సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు వీలైన విధంగా చెక్కతో చేయబడిన వంట పాత్రలూ, గరిటెలూ, ఇల్లూ- భర్తా- తల్లీదండ్రులూ-అత్తా మామలూ- నుయ్యీ -రోలూ -రోకలీ మొదలైన బొమ్మలు సమకూర్చేవారు. ( అవేనండీ లక్కపిడతలు అని అనేవారు) .
అంటే, అప్పటి నుండే గృహిణీ భాధ్యతని, బొమ్మలాటల ద్వారా నేర్పుతూ గుర్తుచేస్తూండేవారు.
తమకి ఓ ప్రత్యేకమైన అభిప్రాయాలు అంటూలేని వయస్సు పది సంవత్సరాలు వయసు కావున, సంసారాలు సజావుగా సాగిపోయేవి.
ఈమెకి ముప్పైఏళ్ళు వచ్చి, కొన్ని మహా స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడ్డాకా, అత్యంత స్థిరమైన అభిప్రాయాలు ఆయనికి ఏర్పడ్డాకా, వీళ్ళిద్దరికీ, పెళ్ళి చేస్తే. ఎవరి మనోభిప్రాయాలు వాళ్ళవే, కలుసుబాటుతనం లేక రొజూ పామూ ముంగీస లాగా కాపురం చేయటమే ఔతొంది కదా, అయితే అందరూ ఇలా కాదులేండి. కొందరు ఇలా.
మిగతాది ఇంకోసారి చెప్పుకుందాము.

Thursday, April 9, 2009

పాటల సందడి _ రవి వర్మకి అందని

రవి వర్మకే అందని ...
Ravivarmake andani...


పల్లవి :
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో (2)
రవి చూడని పాడని నవ్య రాగానివో ll రవి వర్మకే ll

చరణం :
రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
యోగమో నన్నుదాటి జంటగా పిలిచే
మూగ భావాలో అనురాగ యోగాలై..
.....
నీ పాటనే పాడనీ ll రవి వర్మకే ll

చరణం :
గగనమో కురులు జారి నీలిమై పోయే
ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ..
ఆ .. ..
కదలాడనీ పాడనీ ll రవి వర్మకే ll

చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
రచన : వేటూరి
సంగీతం : G. k. వెంకటేష్
గానం: S. P. బాలు, S. జానకి .
కవి రచన ఎంతో అందంగా వుంది . రవి వర్మ గొప్ప చిత్ర కారుడు అలాంటి చిత్ర కారునికే అందనంత గొప్పగా వున్న అందం గల ఆమెని వర్ణించుట చాలా బాగుంది . రచనా శైలి అద్భుతంగా అనిపిస్తుంది.