Thursday, February 12, 2009
ఈ ఐదు జంటలలో మీరే జంట ?
ఒక సారి ఎలాగా అనుకుందాం .
శ్లోకం: లక్ష్మీ నారాయణౌ - గౌరీ శంకరౌ - భారతీ విధి!
చాయాసూర్యౌ - రోహిణీందు - రక్షేతాం చ వధువరు !
అనికదా శ్లోకం దాని అర్ధం ఇలా ఉహించుకోవాలనే అభిప్రాయంతోనే నారాయణుని గుండెలమీద లక్ష్మీ, శంకారుని మొత్తంలో సగంగా గౌరీ, బ్రహ్మ నాలుక మీద సరస్వతీ............ ఇలా ఉంటారని ప్రచారం చేయడం జరిగిందన్న మాట.
ముందు అనుకున్నట్లుగా ఒకరు గుండెలమీద, ఒకరు చేరిసగంగా, మరొకరు నాలుకమీద...... ఇలా ఉండటం అసాధ్యము- అయితే ఆ ఉండటాన్ని, ఇలా అర్ధము చేసుకోవాలని పెద్దలు చెప్పే మాట. అసలు ప్రాచీనులు, దేన్ని రాసినా, ఇలా పైకి తెలిపోఎలాను, లోపల గంభీరార్ధం ధ్వనిమ్చేలాను, అది కూడా పరిశీలించిన వానికే అంతుబట్టేలా
రాసేవారు.
ఇలాంటి ఐదు జంటలలో ఇంతకీ, మీరు ఏ జంట అయ్యారో ఆలోచించుకున్నారా? ఆ పెళ్ళినాడు ఏ మంత్రాలని ఏమని చదివారో, ఆనాడు చదివిన మంత్రంకు అర్ధము ఏమిటో, అప్పుడు తెలియక పోయినా , ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
Wednesday, February 11, 2009
చివరిది రోహిణీ చంద్రుల జంట :
ఏ దంపుతులైనా ఐదు విదాలల్లో ఒకరే : చివరిది (ఐదవది ) రోహిణీ చంద్రుల జంట.
రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయని సామెత, ఉంది . చంద్రుడు పరమాహ్లాదాన్నీ, ఆకర్షణని కలుగ చేస్తాడు. మెత్తని వాడు. సున్నిత స్వభావి ను. ఏ ఇంట భర్త ఉండి లోకానికంతటికీ ఆకర్షనీయుడై ఉంటాడో. భార్య మాత్రం కటినంగాను , విసుగు , చిరాకు , కోపం, పట్టుదల తోను ఉంటుందో, ఆ జంట రోహిణీ చంద్రుల జంట అవుతుంది.
మనము నిజ జీవితము లో కూడా చూసే వుంటాము. భార్య గయ్యాళి భర్త శాంత స్వభావిఅయ్యి వుంటారు. గొప్ప గొప్ప పేరు తెచ్చుకునా కొందరిలో సోక్రటీసు వంటివారు కూడా ఇలాంటి జంటే.
అలా దంపతులు మెలిగితే వారిని రోహిణీ చంద్రుల జంట అనవచ్చు.
Tuesday, February 10, 2009
నాల్గవది చాయాసూర్యుల జంట :
సూర్యుడు చండ ప్రచండంగా వేలుగుతాడు . అతని భార్యైన చాయాదేవి అతని తీక్షణకు తట్టుకొంటు వెడుతూ వుంటుంది . తన భర్త లోకానికి ఉపకారము కోసం పాటు పడేవాడు. కానీ విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా నీడలా పరిస్థితికి అనుగుణముగా సర్దుకు పోతూ వుంటుంది చాయాదేవి .ఏ ఇంట భర్త కఠినముగా తీక్ష్ణము గా విసుగూ, చిరాకూ , కోపం, పట్టుదల లతో చండ ప్రచండగా ఉంటాడో, ఏ ఇంట అతని భార్య మాత్రము నెమ్మదిగాను , సాంతముగాను , అనుకువగాను ఉంది సంసారాన్ని తీర్చిదిద్దుకొంటు సర్దుకు పోయే గుణం కలిగి వుంటుందో . అలాంటి జంట , చాయా సూర్యుల జంట అవుతుంది.
ప్రతీ మనిషిలోని లోపాలు సహజం .అలాగే మంచితనము సహజము. ఎలా ఐతే చాయాదేవి సూర్యునిలో లోపం చండ ప్రచండమైన తీక్షణత ను గుర్తించింది కాని సూర్యునిలో గొప్పతనము పరోపకార గుణమును గుర్తించింది . ఆమె సూర్యునిలో మంచిని చూసి అతనితో సర్దుకు పోయింది . దంపతులు కూడా అంతే ఒకరు ఒకరు కోపం చికాకుగా వున్నప్పుడు రెండవవారు ప్రశాంతముగా ఉంది సమస్యను పరిష్కరించుకోవాలి. రెందవారు కూడా అదే పరిస్తితి వుంటే ఆ దాంపత్యము సవ్యముగా సాగదు.
ఒకరికి ఒకరు సహకరించుకొంటు సంసారాన్ని సరిగా వుంచుకుంటారో వారు చాయా సూర్యుల జంట అన్నమాట.
Sunday, February 8, 2009
మూడవది బ్రహ్మా సరస్వతుల జంట :

మనము మొదటి శ్లోకములో భారతీ విధి అని చెప్పుకున్నాము కదా ........
అయితే ఇక్కడ బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది అంటారు. నాలుక అనేది మాటకు సంకేతము .
బ్రహ్మ నాలుకమీద సరస్వతి ఉంటుంది అంటే అర్ధము ఏమిటీ?
దాని అర్ధము ఇద్దరి మాట ఒక్కటే అని . ఇద్దరి లో ఎవరు మాటాడినా అది ఒకటే అయ్యి ఉంటుంది. అల్లా ఏ మాట మాటాడినా , ఆ భార్య మాటే భర్త మాటాడుతాడు. ఆ భర్త మాటే భార్య మాటాడుతుంది.
అల్లాంటి జంట ఎక్కడ వుంటుందో ఆ జంటను బ్రహ్మాసరస్వతుల జంట అనవచ్చును.
వీరి లా ఒకరి కి ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నవారు . ఒకరి మీద ఒకరికి అభిమానము ప్రేమ ఉన్నప్పుడు వారి వారి మనస్సులు తెలిసి ఒక్కగా మాతాడుతారు. అల్లాంటి జంటను బ్రహ్మా సరస్వతులు కాపాడుదురు గాక.
Saturday, February 7, 2009
రెండవది గౌరీ శంకరుల జంట :
వీళ్ళది అర్ధనారీశ్వర రూపం . తలనించి కాలి వ్రేలి వరకు నిట్టనిలువుగా చెరిసగముగా ఉంటూ రెండు కలపిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత.
ఆలోచనకి తలా, కార్యనిర్వాహనానికి కాలు సంకేతము. (తల లేదా? అని తిడుతువుంటారు. అలాగే వాడికి తలతిక్క అని కుడా అంటుంటారు. ఇక్కడి తల అనే మాటకీ ఆలోచన అనే కాదా అర్ధం! అలాగే మాటలు కోటలు దాటుతాయి గానీ, కాలు గడపదాతాడు - అంటుంటారు. అంటే ఇక్కడి కాలు అనే మాటకీ "క్రియ" అని కదా అర్ధం . కాబట్టి కాలు అంటే కార్యనిర్వాహనమే ) అలా ఏ భార్యాభర్తలు ఆలోచన దగ్గర్నించి క్రియ వరకు సరిసమానంగా నిర్వహించుకుంటు పోతుంటారో, ఆ జంట గౌరీ శంకరుల జంట అవుతుందన్నమాట.

మరో విశేషం కుడా ఉంది. ఓ సగం రూపంగా అయ్యవారు కుడివైపున మరో సగం రూపంగా అమ్మవారు ఎడంవైపునా ఉంది, ఆ ఇద్దరి కలయికతో ఏర్పడినదే అర్ధనారీశ్వర రూపం అవుతోంది. ఇక్కడే ఉంది విశేషం.
అయ్యవారి నెత్తిమీద కురులు ముడివేసి అందముగా తీర్చిన కొప్పుమ్టే ఎడమ ప్రక్కగా అమ్మవారి `జడ బిళ్ళ' (చూడామణి) ఉంటుంది.
అయ్యవారి నుదుటి మీద ముడో కన్నుంటే, ఆ ఎడమప్రక్క, కస్తూరితో కలసిన గంధపుబొట్టు అమ్మవారి కుంటుంది.
అయ్యవారి చెవికి నాగకడియం ఉంటే, అమ్మవారి చెవికి బంగారపు కమ్మ వుంటుంది.
అయ్యవారి కంటమునకు విషపు గుర్తు నీలంగా ఉంటే, అమ్మవారి కంఠానికి చక్కని గంధపు బొట్టు వుంటుంది.
అయ్యవారి మెడలో రుద్రాక్షలుమ్టే అమ్మవారి మెడలో రత్నాల ఆభరణాలు ఉంటాయి.
అయ్యవారి బుజాలకి డందకడియాలు గా పాములే ఉంటాయి , అమ్మవారికి రత్నగదమ్ ఉంటుంది.
అయ్యవారి చేతిలో భిక్షాపాత్ర వుంటే, అమ్మవారి చేతిలో భిక్షార్డులకి అన్నం పెట్టేందుకు గరిటె సిద్ధముగా వుంటుంది.
అయ్యవారు పుటలు కడితే, అమ్మవారు బంగారుపట్టు చీరె ధరించి ఉంటుంది.
ఎందుకు ఇంత చెప్పవలసి వచ్చిందంటే. అయ్యవారు పూర్తీ బిచ్చగాని వేషంలో ఉంది కుడా, అమ్మవారు ధనవంతుల పుత్రికగానే ఉమ్చుతాడని గుర్తింప చేయడానికే , ఆయనికి ఏం కావలసిన అమ్మవారే ఇవ్వాలి.
ఇలా, భార్యని గొప్పగా చూస్తూ, ఏది కావాలన్నా ఆమెనే అడిగే భర్త శంకరుడు. తన భర్త అడిగిందే తడవుగా ఇచేది - భర్త అమాయకుడై విషాన్ని మింగబోతుంటే వెళ్లి రక్షించు కునేదీ, ( భర్తని రక్షించుకునే గడుసు తనము కలది)
ఆయన భార్య గౌరీదేవి.
కాబట్టి భార్యని గొప్పగా చూసుకునే భర్తా, బోలా బోలీగా ఉన్నా భర్త ఆపదలో చిక్కుకుంటే రక్షించే భార్యా- ఉన్నా జంట గౌరీ శంకరుల జంట అన్నమాట .
ఒకరి కోసం ఒకరు బ్రతికే జంటలన్నీ గౌరీ శంకరుల జంటే. అలాంటి వారిని ఆ గౌరీ శంకరులు తప్పక ఆసీర్వధించుదురు గాక.
మొదటిది లక్ష్మీ నారాయణుల జంట :

శ్రీ మహా విష్ణువుకి వక్ష స్థలం మీద ఉంటుంది లక్ష్మీ దేవి .
వక్షః స్థలంలోని హృదయం ఆలోచనలకి కూడలి.
అక్కడే లక్ష్మీ దేవి వుంటుంది. అంటే .................
ఏ భార్యా భర్తల హృదయం అయినా ఒక్కటై ,
ఆలోచన కుడా ఆ ఇద్దరిదీ ఒక్కటై ఉంటుందో,
ఆ జంట లక్ష్మీ నారాయణుల జంట అవుతుందన్నమాట.ఒకరి ఆలోచనలను ఇంకొకరు పూర్తిగా మనస్పూర్తిగా గౌరవించుతారు .
ఇద్దరి అబిప్రాయాలు ఒక్కగా వుంటాయి . వారి పనులు ఒక్కటిగా వుంటాయి .ఇద్దరు సమానంగా వుంటారు ఒకరు ఎక్కువా మరొకరు తక్కవ అనే ప్రశ్న రానే రాదూ. వీరే లక్ష్మీ నారాయణ జంట అనటంలో ఎటువంటి సందేహములేదు.
ఇలాంటి దంపతులకు తప్పకుండా లక్ష్మీ నారాయణుల ఆశీర్వాధము లభించు గాక.
Friday, February 6, 2009
ఏ దంపతులైనా ఐదు విధాల్లో ఒకరే ! (1)
ఛాయాసూర్యౌ - రోహిణీందూ - రక్షేతాం చ వధువరౌ !
లోకంలో కోట్ల కోట్ల దంపతులున్నా వాళ్లంతా ఐదు విధాలుగానే ఉంటారుట.
దైవతలైనా లక్ష్మీ నారాయణులూ , గౌరీ శంకరులూ ,బ్రహ్మా సరస్వతులూ, ఛాయాదేవి సూర్యులూ, రోహిణీ చంద్రులూ - అనేవారి కొవకే చెందుతారట.
క్రొత్తగా పెళ్ళవుతున్న ఈ దంపతులని అలాంటి దంపతులు దీవించి రక్షించాలని ఈ శ్లోక భావము .
పెళ్లి పందిరిలో పెద్దలు చేసే ఆశీర్వచన శ్లోకాల్లో ఒకటి ఇది. దేవతలలో మాత్రం ఎందఱు దంపతులు లేరు ! ఈ ఐదుగురేనా? ఐనా వీళ్లో మాత్రమే ఉండే విశేషం ఏమిటట? ఏదంపతులైనా ఈ ఐదుగురిలో ఒకరుగా మాత్రమే ఎలా ఉంటారట? చూద్ధాము.